రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ రెండు అర్హతలుంటే చాలు

భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే డబ్ల్యూసీఆర్‌ పరిధిలోని యాక్ట్ అప్రెంటిస్‌ 3,015 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అప్లికేషన్ చివరి తేది 2024 జనవరి 14.

రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్.. ఈ రెండు అర్హతలుంటే చాలు
New Update

2023 Indian Railway WCR Recruitment : భారతీయ రైల్వే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న వివిధ ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే డబ్ల్యూసీఆర్‌ పరిధిలోని డివిజన్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు కింద సూచించిన విధంగా ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది.

ఈ మేరకు ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3,015 అప్రెంటిస్‌ ఖాళీలను భర్తీ చేయనుండగా..  జేబీపీ డివిజన్, బీపీఎల్‌ డివిజన్, కోటా డివిజన్, సీఆర్‌డబ్ల్యూఎస్‌ బీపీఎల్‌, డబ్ల్యూఆర్‌ఎస్‌ కోటా, హెచ్‌క్యూ/ జేబీపీ యూనిట్లలో పలు ఖాళీలున్నాయి.

ట్రేడ్‌లు:
మెకానిక్, అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, బ్లాక్‌స్మిత్‌, బుక్ బైండర్, కేబుల్ జాయింటర్, కార్పెంటర్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫొటోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్‌ కీపర్‌, మెషినిస్ట్‌, మాసన్‌, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.

ఇది కూడా చదవండి : పార్లమెంట్ భద్రతా వైఫల్యం.. బీజేపీపై పొన్నం సంచలన వ్యాఖ్యలు

అర్హత:
పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు:
14.12.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాలుండాలి.

దరఖాస్తు :
ఆన్ లైన్ విధానంలో 2024 జనవరి 14లోగా అప్లై చేసుకోవాలి. ఫీజు రూ.136. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.36 చెల్లిస్తే చాలు.

ఎంపిక విధానం:
మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

#jobs #indian-railway #apprentice
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe