Vande Bharat: వందే భారత్ ఢీకొని ముగ్గురు మృతి భారత్‌లో రైలు ప్రమాదాలు, యాక్సిడెంట్లలో మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు మీరట్ లో వందే భారత్ ట్రైన్ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. By Manogna alamuru 30 Oct 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Vande Bharat Train Accident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో (Meerut) వందే భారత్ రైలు ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కసంపూర్ దగ్గర వందే భారత్ రైలు రానుండడంతో క్రాసింగ్ గేట్లను మూసివేశారు. అయినా కూడా రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు 40 ఏళ్ళ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు. కానీ వారు పట్టాలు దాటుతుండగా అత్యంత వేగంగా వచ్చిన వందే భారత్ ట్రైన్ (Vande Bharat Train) వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటనలో మృతి చెందినవారు మీరట్ కు చెందిన మోనా, మనీషా, చారులుగా గుర్తించారు. మోనాకు 40 ఏళ్ళు కాగా, మనీషాకు 14, చారుకు 7 ఏళ్ళు. Also Read: Kerala Bomb Blast: అది తట్టుకోలేకే క్రిస్టియన్ సంస్థపై బాంబు దాడి.. నిందితుడి వీడియో వైరల్ .! మరోవైపు విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. 50 మందికి పైగా గాయపడ్డారు. రాత్రి 7 గంటల 10 నిమిషాలకు విశాఖ నంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టింది. మొదట పట్టాలు తప్పిన రైలును మరో రైలు ఢీకొట్టినట్లు అధికారులు భావించారు. కానీ సిగ్నల్ కోసం వేచి ఉన్న పలాసకు వెళ్తున్న రైలును విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. Also read:మళ్ళీ కళ్ళు చెదిరే బిగ్ సేల్ తో వచ్చేస్తున్న ఫ్లిప్ కార్ట్ #accident #vande-bharat #vande-bharat-train-accident మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి