General Elections: మోదీ-యోగి దిమ్మదిరిగే ప్లాన్‌.. పుణ్యక్షేత్రాలకు రూ.86వేల కోట్ల పెట్టుబడులు అందుకేనా?

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీ-బీజేపీ క్లీన్‌ స్వీపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. జాబ్స్‌ క్రియేషన్‌పై ఎక్కువగా ఫోకస్‌ చేస్తోంది. మొత్తం 8 ధార్మిక ప్రదేశాల్లో రూ.86వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టనుండగా.. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

New Update
General Elections: మోదీ-యోగి దిమ్మదిరిగే ప్లాన్‌.. పుణ్యక్షేత్రాలకు రూ.86వేల కోట్ల పెట్టుబడులు అందుకేనా?

Jobs Creation in UP: యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఉత్తరప్రదేశ్‌ అభివృద్ధిలో దూసుకుపోతోంది. ముఖ్యంగా ప్రాజెక్టులపై యోగి భారీగా ఖర్చు చేస్తున్నారు. నిజానికి ప్రాజెక్టులతో రాష్ట్ర భవిష్యత్‌ అద్భుతంగా ఉంటుంది. అటు కేంద్రం సైతం ఉత్తరప్రదేశ్‌కు అండదండలు అందిస్తోంది. దేశంలో మరే ఇతర రాష్ట్రానికి లేని విధంగా సాయం చేస్తోంది. ప్రధాని మోదీ గుజరాత్‌ కంటే ఎక్కువగా యూపీపైనే ఫొకస్‌ చేస్తున్నారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మరోసారి లక్నోలో పర్యటించిన మోదీ పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు భారీగా నిధులు కేటాయించారు.

లక్షల మందికి ఉపాధి:
ఎన్నికల్లో గెలవాలంటే కచ్చితంగా యువతని తమవైపు తిప్పుకోవడం ముఖ్యం. యూపీ బీజేపీ ఈ విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. యూపీ పర్యటనలో మోదీ మతపరమైన నగరాల్లో పెట్టుబడుల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇందులో అయోధ్య, కాశీ, మథురలలో సుమారు 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ నగరాలతో సహా రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది ధార్మిక ప్రదేశాల్లో రూ.86,000 కోట్ల విలువైన 500 ప్రాజెక్టులు చేపట్టనుంది బీజేపీ. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది సార్వత్రిక ఎన్నికల్లో అతి పెద్ద ఎసెట్ కానుందని విశ్లేషకులు చెబుతున్నాయి.

పెట్టుబడులపై మరింంత ఫోకస్:
పెట్టుబడుల ప్రాజెక్టులపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. అటు అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇన్వెస్టర్లు కూడా ఈ నగరాలపై ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఒక్క అయోధ్య, కాశీ, మథురలకే దాదాపు రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించింది బీజేపీ. ఇందులో రూ.15,314 కోట్లతో కాశీలో 124 ప్రాజెక్టులు, రూ.13,487 కోట్లతో మధురలో 81 ప్రాజెక్టులు, రూ.10,156 కోట్లతో అయోధ్యలో 146 ప్రాజెక్టులు ఉన్నాయి. అయోధ్యలో పర్యాటక శాఖ ద్వారానే రూ.3,500 కోట్ల పెట్టుబడితో 142 హోటళ్లు, రిసార్టులు, అతిథి గృహాలను నిర్మించనున్నారు.

వందలాది ప్రాజెక్టులు.. లక్షల జాబ్స్:
అదే సమయంలో గృహనిర్మాణ శాఖ ద్వారా రూ.3,409 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అయోధ్యలోని అన్ని శాఖలకు చెందిన 146 ప్రాజెక్టుల ద్వారా సుమారు 50 వేల మందికి ఉపాధి లభించనుంది. అదేవిధంగా వారణాసిలో వివిధ శాఖలకు చెందిన 124 ప్రాజెక్టులను అమలు చేయనున్నారు. వీరిలో అత్యధికులు టూరిజం, హాస్పిటాలిటీ రంగానికి చెందినవారే. దీనివల్ల సుమారు 43 వేల మందికి ఉపాధి లభిస్తుంది. మథురలో 81 ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లతో మథుర-బృందావన్ కారిడార్‌ను నిర్మించనుంది. దీనివల్ల అక్కడ పెట్టుబడిదారులు, పర్యాటకుల సంఖ్య మరింత పెరగడంతో పాటు సుమారు 30 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అటు 2025లో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్న దృష్ట్యా అక్కడ పెట్టుబడుల ప్రాజెక్టులను వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలోకి తీసుకురావాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.

Also Read: గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల

WATCH:

Advertisment
తాజా కథనాలు