Jobs: 'మనిషి అన్నాక కాసింత కళా పోషణ ఉండాలి భయ్యా'.. ఆర్ట్స్‌ ఫీల్డ్‌లోని ఈ జాబ్స్‌పై ఓ లుక్కేయండి!

'మనిషి అన్నాక కాసింత కళా పోషణ ఉండాలి అయ్యా' అని రావుగోపాల్‌రావు ఓ సినిమాలో ఊరికే అనలేదు. దానికి వెనుక చాలా అర్థం.. పరమార్థం ఉంది. హై క్రియేటివిటీ ఉన్నవాళ్లు భారీగా డబ్బులు ఆర్జించుకునే అవకాశాలు మార్కెట్‌లో నిత్యం ఉంటాయి. క్రియేటివ్ రైటర్‌, ఫిల్మ్‌ డైరెక్టర్‌, మ్యూజిక్‌ ప్రొడ్యూసర్లు లక్షలు, కోట్లు సంపాదించుకోవచ్చు.

Jobs: 'మనిషి అన్నాక కాసింత కళా పోషణ ఉండాలి భయ్యా'.. ఆర్ట్స్‌ ఫీల్డ్‌లోని ఈ జాబ్స్‌పై ఓ లుక్కేయండి!
New Update

Best Jobs in Arts, entertainment industry: మీరు సినిమాలు బాగా చూస్తారా? ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని కోరుకుంటున్నారా? కళల గురించి కల కంటున్నారా? వాటిలో ఏది బెస్ట్ జాబ్‌ అని సెర్చ్ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు మీ కోసమే. కళ, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీ ప్యాషన్‌ అయితే ఈ జాబ్స్‌ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే..! ఎందుకంటే చిన్నచిన్న జాబ్‌లతో పూట గడవడం కష్టంగా మారిన రోజులివి.. మార్కెట్‌లో ఉప్పు నుంచి పప్పు వరకు ప్రతి వస్తువు ధర వాచిపోతుంది. చదువుతో పాటు కాసింత కళా పోషణ ఉంటే... మీరు కూడా సినిమా రంగంవైపు వెళ్లచ్చు.. కేవలం సినిమా ఇండస్ట్రీనే కాదు.. ఆర్ట్స్‌ ఫిల్డ్‌కి సంబంధించి ఎన్నో జాబ్స్‌ మీ ముందు ఉంటాయి. వాటిలో ఈ మూడు జాబ్స్‌పై ఓ లుక్కేయండి..!



ఫిల్మ్‌ డైరెక్టర్:

కథలకు జీవం పోసే బాధ్యత సినిమా దర్శకులదే. పరిశ్రమ గుర్తింపుతో ఫిల్మ్‌ డైరెక్టర్లు గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చు. దర్శకుడిగా మారడానికి అంకితభావం, పట్టుదలతో పాటు మంచి వర్క్‌ పోర్ట్‌ఫోలియో తప్పనిసరి. ప్రతి విషయాన్ని కళాత్మక దృష్టి కోణంతో చూసే అలవాటు ఉండాలి.. క్రియేటివిటీ అన్నది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఈ సృజనాత్మక మీలో నిండుగా ఉంటే మీరు కూడా ఫిల్మ్‌ డైరెక్టర్ కావొచ్చు. దర్శకుడిగా రాణించవచ్చు. అనుభవం పెరిగే నైపుణ్యం కూడా పెరుగుతుంది. సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ అవ్వగలిగితే ప్రొడ్యూసర్ల నుంచి భారీగా డిమాండ్‌ చేయవచ్చు. కెరీర్‌ స్టార్టింగ్‌లో కష్టాలున్నా తర్వాత అవి ఉండవు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి.. మన కష్టమే మన కెరీర్‌ని ఎదిగేలా చేస్తుంది..అది ఏ ఫిల్డ్‌ అయినా కావొచ్చు!



సంగీత నిర్మాత:

మ్యూజిక్‌ ప్రొడ్యూసర్స్‌కి ప్రస్తుతం ఫుల్ డిమాండ్ ఉంది. ఇండియా అన్నది సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడే దేశం. మన దేశ మూలల్లోనే మ్యూజిక్‌ ఉంది. రిలెక్స్‌షన్‌ కోసం.. లేదా బాధలను పొగొట్టుకొవడం కోసం.. ఇలా ప్రతి విషయంలోనూ సంగీతం అందరి జీవితాల్లో నాటుకుపోయింది. సంగీత నిర్మాతలు మ్యూజిక్‌ పరిశ్రమలో చాలా కీలకం. హిట్ పాటలను రూపొందించడానికి కళాకారులతో సన్నిహితంగా పని చేస్తారు. చార్ట్-టాపింగ్ ట్రాక్‌లను క్రియేట్ చేయడంలో నైపుణ్యం ఉన్న మ్యూజిక్‌ ప్రొడ్యూసర్లకు భారీ ప్యాకేజీలను సంస్థలు ఆఫర్‌ చేయవచ్చు.. ఇది సినిమా నుంచి లేదా ప్రైవేట్‌గానూ డబ్బులు ఆర్జించుకునే జాబ్‌.



క్రియేటివ్ రైటర్‌:

స్క్రీన్ లేదా నవలా రచయితలు లాంటి క్రియేటివ్‌ రైటర్లకు ట్రెడిషనల్‌గా డిమాండ్‌ ఉంటుంది. తమ కథా నైపుణ్యం ద్వారా భారీ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. విజయవంతమైన రచయితలు తరచుగా వారి ప్రచురించిన స్టోరీలకు రాయల్టీలను అందుకుంటారు. సినిమా ప్రొడ్యూసర్లు కథలు నచ్చితే వారి స్క్రిప్ట్‌ల కోసం బాగా చెల్లించి ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

#film-director #film-writer #screen-writer #best-jobs-in-film-industry #best-jobs #jobs
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe