షావర్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చిన్నపిల్లల నుంచి పెద్ద వారు వరకు ఇష్టంగా తింటుంటారు. కానీ షావర్మా తినడం వల్ల ఓ 24 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 18న కొట్టాయం వాసి రాహుల్ నాయర్ లే హయత్ రెస్టారెంట్ నుంచి షావర్మా ఆర్డర్ చేసుకున్నాడు.
దానిని తిన్న తరువాత ఆయన తీవ్ర అనారోగ్యం పాలయ్యాడు. దాంతో ఆయన అక్టోబర్ 19న కక్కనాడ్ లోని సన్ రైజ్ ఆసుపత్రిలో చేరాడు. హాస్పిటల్ లో చేరిన తరువాత ఆయన అదే రోజు ఇంటికి వచ్చాడు. అయితే మళ్లీ రెండు రోజుల తరువాత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు.
Also read: హైకోర్టులో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్
అయితే బుధవారం రాత్రి రాహుల్ పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. ఈ విషయం గురించి ఆసుపత్రి వర్గాలు మాట్లాడుతూ..ఆయన మీద విష ప్రయోగం జరిగిందనే విషయం స్పష్టమైనట్లు తెలుస్తుంది. అయితే అది షావర్మా తినడం వల్ల జరిగిందా..లేక ఇంకా ఏదైనా దాని వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.
రాహుల్ తిన్న షావర్మా లో ఏమైనా విషం కలిసిందా అనే అనుమానాలతో..రాహుల్ షావర్మా తెప్పించుకున్న హోటల్ యజమాని పై త్రిక్కకర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెస్టారెంట్ నుంచి కొన్ని నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్ కి పంపినట్లు పోలీసులు తెలిపారు.
రాహుల్ కిడ్నీ, కాలేయం పాడవ్వడంతో పాటు గుండెపోటుకు గురైనట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రాహుల్ హస్పిటల్ లో ఉన్న అన్ని రోజులు కూడా అతన్ని వెంటిలేటర్ సపోర్ట్ పై పెట్టినట్లు వైద్యులు వివరించారు.
Also read: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి..వైద్యులు ఏమన్నారంటే!