JOBS : ఏపీ వైద్యశాఖలో 234 ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే నెలకు లక్ష జీతం ఏపీ వైద్య సేవల నియామక మండలి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు ప్రాతిపదికన 234 స్పెషలిస్టు డాక్టర్ల నియామకం చేపట్టబోతున్నట్లు తెలిపింది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 7వరకూ దరఖాస్తు చేసుకోవాలి. పరీక్షలేకుండానే ఈ నియామకాలు చేపట్టనుంది. By srinivas 04 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి National Health Mission : జాతీయ ఆరోగ్య మిషన్(National Health Mission) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఆధ్వర్యంలోని వివిధ ఆరోగ్య శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన 234 స్పెషలిస్టు డాక్టర్ల(Specialist Doctor Posts) నియామకం చేపట్టబోతున్నట్లు ఏపీ వైద్య సేవల నియామక మండలి(APMSRB) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నోటిఫికేషన్ తో రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్(Special New Borncare Unit), డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్‌వెన్షన్ సెంటర్, తదితర హాస్పిటల్స్ లో పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. విభాగాల వారీగా ఖాళీలు : జనరల్ మెడిసిన్- 38 ఓబ్‌స్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ- 37 పీడియాట్రిషియన్- 114 కార్డియాలజిస్ట్/ జనరల్ మెడిసిన్- 29 ఎపిడెమియాలజిస్ట్ - 15 అర్హత: అభ్యర్థులు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషాలిటీలో ఎంపీహెచ్, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు: ఆసక్తిగల అభ్యర్థులు 2024 ఫిబ్రవరి 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇది కూడా చదవండి: JOBS: యూనియన్ బ్యాంక్ లో 606 ఉద్యోగాలు.. దరఖాస్తు చివరితేదీ ఇదే వయోపరిమితి: 42 ఏళ్లు దాటకూడదు ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. జీతం: నెలకు రూ.1,10,000 నుంచి రూ.1,40,000 వరకు. ఎపిడెమియాలజిస్ట్ పోస్టులకు రూ.60,000. #andhra-pradesh #national-health-mission #234-specialist-doctor-posts మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి