Bank Jobs 2024: నిరుద్యోగులకు శుభవార్త.. 2211 బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!! బ్యాంక్ ఉద్యోగాలకు కోసం ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. ఎస్ బీఐ, పంజాబ్ నేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ , ఐడీబీఐ బ్యాంక్ లు వేరు వేరుగా రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు విడుదల చేశాయి. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 17 Feb 2024 in జాబ్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bank Jobs 2024: బ్యాంక్ లో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నవారికి శుభవార్త. ఎస్ బీఐ, పంజాబ్ నేషన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ , ఐడీబీఐ బ్యాంక్ లు వేరు వేరుగా రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్లు రిలీజ్ చేశాయి. న్యూఢిల్లీలోని PNB స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు PNB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.PNB రిక్రూట్‌మెంట్ 2024 కింద మొత్తం 1025 పోస్టులు రిక్రూట్ చేయనున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి ముంబై కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగ మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రెగ్యులర్ ప్రాతిపదికన స్పెషలిస్టు కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 80పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. పూర్తి వివరాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఆఫీస్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది స్పెషలైజ్డ్ సెగ్మెంట్ లో భాగంగా దేశవ్యాప్తంగా యూనియన్ బ్యాంక్ శాఖల్లో 660 స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంఅయ్యింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 23వ తేదీలోగా అప్లయ్ చేసుకోవాలి. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఐడీబీఐ బ్యాంక్ భారీ ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు జోన్లలో ఖాళీగా ఉన్న 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ల భర్తీకి సంబంధించి ఐడీబీఐ బ్యాంక్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పూర్తి వివరాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఇది కూడా చదవండి: జగన్‌కు ఇవే చివరి రోజులు.. చంద్రబాబు హెచ్చరికలు! #sbi #bank-jobs-2024 #idbi #union-bank-of-india-recruitment-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి