క్రికెట్‌ ఆడుతూ..22 ఏళ్ల యువకుడు..గుండెపోటుతో!

నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలోని ఓ యువకుడు ఆదివారం సరదాగా స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

New Update
క్రికెట్‌ ఆడుతూ..22 ఏళ్ల యువకుడు..గుండెపోటుతో!

మారుతున్న కాలంతో పాటు మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా యువత ఆరోగ్యంలో పెనుమార్పులు సృష్టిస్తున్నాయి. చిన్న వయసులోనే ఆకస్మిక మరణాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది మొదలై ఇంకా 8 నెలలు కూడా గడవలేదు..అప్పుడే అనధికారికంగా వందలాది మంది మృతి చెందారు.

నిత్యం ఎక్కడో ఒక చోట గుండెపోటుతో ఫలానా యువకుడు మృతి చెందాడు అనే వార్త వినాల్సి వస్తుంది. తాజాగా నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలోని ఓ యువకుడు ఆదివారం సరదాగా స్నేహితులతో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

వివరాల ప్రకారం..నంద్యాల జిల్లా బేతంచర్ల పట్టణంలోని సంజీవనగర్ కాలనీకి చెందిన 22 సంవత్సరాల మహేంద్ర కాలనీ సమీపంలో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కిందపడిపోయాడు.

స్నేహితులు వెంటనే చుట్టుపక్కల వారికి తెలియజేశారు. అందరూ కలిసి మహేంద్రను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ..అప్పటికే మహేంద్ర గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు.

చేతికి అంది వచ్చిన 22 ఏళ్ల కొడుకు కళ్ల ముందు విగత జీవిగా పడి ఉండటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. జిమ్ లో జిమ్‌ చేస్తుండగా కొందరు యువకులు, క్రికెట్ ఆడుతూ కొందరు యువకులు , 13 ఏళ్ల బాలిక కూడా గుండెపోటుతో మరణించింది. వయసుతో సంబంధం లేకుండా ..గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు