అమెరికాలో మళ్ళీ మోగిన తుపాకులు...22 మంది మృతి

అమెరికాలో మరొకసారి తుపాకుల మోత మోగింది. లెవిస్టన్, మైనే ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారు. మరో 60మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.

అమెరికాలో మళ్ళీ మోగిన తుపాకులు...22 మంది మృతి
New Update

అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. లెవిస్టన్, మేసే ప్రాంతాల్లో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఇందులో 22 మంది చనిపోయారు. మరో 60 మందికి గాయాలయ్యాయి. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేస్తున్నారు. గాయపడిన వారిలో కొంతమంది ప్రాణాపాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన తర్వాత దుండగులు పారిపోయారు. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

అయితే కాల్పులు చేసినది ఒకరా లేక గ్రూప్ గా వచ్చారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఒకరిని అయితే గుర్తించారు. అతనే యాక్టివ్ షూటర్ అని పోలీసులు చెబుతున్నారు. లెవిస్టన్ లో ఉంటున్న స్థానికులకు ఇళ్ళల్లోనే ఉండమని పోలీసులు సూచిస్తున్నారు. కొంతసేపు బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read:మునుగోడు కాంగ్రెస్‎లో ముసలం..చలమల కృష్ణారెడ్డి అలక..!!

లెవిస్టన్ లో మూడు వేర్వేరు చోట్ల దుడగులు కాల్పులు జరిపారు. బౌలింగ్ గేమ్ ఆడే ప్లేస్, స్కిమెంగీస్ బార్ అండ్ గ్రిల్ రెస్టారెంట్, వాల్ మార్ట్ డిప్ట్రిబ్యూషన్ సెంటర్ లలో కాల్పులు జరిగాయి. బౌలింగ్ ప్లేస్, వాల్ మార్ట్ లు బార్ కు అటు ఇటు కొద్ది దూరంలో ఉన్నాయి. షూటింగ్ చేసినవారు పక్కా ప్లాన్ తో వచ్చారని తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన దుండగుడిని  పోలీసులు అరెస్ట్ చేశారు.
మైన్ నగరానికి చెందిన రాబర్ట్ కార్డ్ గా గుర్తించారు. కాల్పులు ఎందుకు జరిపాడు. ఇతనొక్కడే ఉన్నాడా...ఇతనితో పాటూ ఎవరైనా కాల్పులు జరిపారా అన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

#killed #america #lewiston #guns
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe