Poling Duty : మధ్యప్రదేశ్(Madhya Pradesh) లోని బేతుల్ జిల్లాలో నిన్న రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. పోలింగ్ విధులు ముగించుకుని వస్తున్న భద్రతా సిబ్బంది వాహనం ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న బస్సును ట్రక్కు ఢీకొట్టింది, దీంతో బస్సు బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ప్రయాణిస్తు్న 21 మంది హోంగార్డులు, పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సును ఢీకొట్టిన ట్రక్కు...
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2024 లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) మొదటి దశ పోలింగ్‌లో భాగంగా చింద్వారా జిల్లాలో భద్రతా సిబ్బంది విధులను నిర్వహించి వెనక్కి తిరిగి వస్తున్నారు. వీరందరూ కలిసి ఒక బస్సులు వస్తున్నారు. వారు రిటర్న్ అయ్యే సమయానికి చీకటి పడిపోయింది. ఇదే సమయంలో ఈ బస్సుకు ఎదురుగా వస్తున్న ట్రక్కు దాన్ని ఢీకొట్టింది. బరేతా ఘాట్ సమీపంలోని జాతీయ రహదారి 47 మీద ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు ఢీకొట్టడంతో బస్సు అక్కడికకడే బోల్తా పడిపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అంబులెన్స్‌లు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. తక్షణమే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన సిబ్బంది చెతుల్, షాపూర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయాలు తీవ్రమైనవి అయినప్పటికీ ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలుస్తోంది.
Also Read:International: డోనాల్డ్ ట్రంప్ విచారణ సమయంలో దుర్ఘటన..కోర్టు బయట నిప్పంటించుకున్న వ్యక్తి