20 Years For Arya : అల్లరి నరేష్ చేయాల్సిన 'ఆర్య' అల్లు అర్జున్ దగ్గరికి ఎలా వెళ్ళింది? తెర వెనుక అంత జరిగిందా?

New Update
20 Years For Arya : అల్లరి నరేష్ చేయాల్సిన 'ఆర్య' అల్లు అర్జున్ దగ్గరికి ఎలా వెళ్ళింది? తెర వెనుక అంత జరిగిందా?

Special Story On Arya Movie : ఐకాన్ స్టార్(Icon Star) అల్లు అర్జున్(Allu Arjun) కి హీరోగా ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన సినిమా 'ఆర్య'(Arya). ఈ మూవీతో సుకుమార్ టాలీవుడ్(Tollywood) కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ మూవీ బన్నీ కి ఎంత స్పెషలో ప్రత్యేకించి చెప్పనవరసరం లేదు. ఈ సినిమా బన్నీ, సుక్కు ఇద్దరి జీవితాలనే కాదు ఇంకెంతో మంది జీవితాలను మార్చేసింది.

ఇంతకీ 'ఆర్య' గురించి ఇప్పుడెందుకు డిస్కషన్ వచ్చిందనే కదా మీ డౌట్? మ్యాటర్ ఏంటంటే.. నేటితో (మే 7) 'ఆర్య' విడుదలై 20 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

'ఆర్య' కి ముందు అనుకున్న టైటిల్ ఏంటి?

'దిల్' సినిమా స్పెషల్ షో కి వెళ్లిన సుకుమార్.. సినిమాలో నితిన్ క్యారెక్టర్ చూసి 'నా హీరో క్యారెక్టర్ కూడా ఇలాగే ఉంటుందని' దిల్ రాజుతో చెప్పాడట. దాంతో దిల్ రాజు వెంటనే అల్లు అర్జున్ తో మాట్లాడారు. బన్నీ రొటీన్ స్టోరీ అనుకోని ముందు వద్దన్నాడు. ఆ తర్వాత ఫుల్ స్టోరీ విన్నాక ఓకే చెప్పాడు. ఇక ఈ సినిమాకి మొదట 'నచికేత' అనే టైటిల్ పెట్టాలనుకున్నారట. ఆ తరువాత అదికాస్తా 'ఆర్య' గా మారింది.

Also Read : ‘RRR’ రీ రిలీజ్.. ఈసారి మరింత స్పెషల్ గా..!

4 నంది అవార్డులు

'ఆర్య' సినిమాకి సుకుమార్ ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అందుకున్నాడు. అలాగే ఈ సినిమాకి మొత్తం 4 నంది అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ స్క్రీన్‌ప్లే (సుకుమార్‌), స్పెషల్‌ జ్యూరీ (అల్లు అర్జున్), ఉత్తమ ఫైట్స్‌ (రామ్‌- లక్ష్మణ్‌), ఉత్తమ గాయకుడు (సాగర్‌) కేటగిరీల్లో నంది అవార్డ్స్ వచ్చాయి.

'ఆర్య' కథ ఆ హీరో కోసం రాసుకున్నాడా?

డైరెక్టర్ సుకుమార్ ఆర్య కథను అల్లరి నరేష్(Allari Naresh) కోసమే రాసుకున్నారట. ఏమైందో తెలియదు కానీ ఆ కథ అల్లరి నరేష్ దాకా వెళ్ళలేదు. అల్లరి నరేష్ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో కూడా చెప్పాడు." 100% లవ్ సినిమా తీస్తున్న సమయంలో సుకుమార్ నన్ను కలిసి అల్లరి సినిమాలో నీ నటన నాకు బాగా నచ్చింది, ఆర్య కథ మీ కోసమే రాసుకున్నా" అని చెప్పినట్లు తెలిపాడు.

#Allu Arjun #20-years-for-arya #arya-movie #allari-naresh
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు