జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ డేట్ ఇదే

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదిని ఐఐటీ మద్రాస్‌ ప్రకటించింది. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పరీక్షను 2024 మే 26న రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 21 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది.

New Update
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది.. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ డేట్ ఇదే
JEE Advanced 2024 Exam Date: ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు తీపి కబురు అందింది. 2024 సంవత్సరానికిగానూ నిర్వహించే పరీక్ష తేదిలు వెలువడ్డాయి. ఈ ఏడాది పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహించనుండగా రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు కింద సూచించిన విధంగా అప్లై చేసుకోవాలన్నారు.

దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ (JEE Advanced) పరీక్ష తేదీని ఐఐటీ మద్రాస్‌ (IIT Madras) ప్రకటించింది. వచ్చే ఏడాది మే 26న రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 21న ప్రారంభమవుతుంది. అదే నెల 30న దరఖాస్తులు ముగుస్తాయి. మే 6న ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి గడువు ముగియనుంది. మే 17 నుంచి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మే 26న ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు రెండో సెషన్‌ను నిర్వహించనున్నారు. ప్రాథమిక కీ మే 31న విడుదల చేయనున్నారు. ఫైనల్‌ కీ, పరీక్ష ఫలితాలను జూన్‌ 9న విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్‌-2024 (JEE Main) క్వాలిఫై అయిన అభ్యర్థులు అడ్వాన్స్‌డ్‌ రాయడానికి అర్హులు. జేఈఈ మెయిన్‌ దరఖాస్తులు నవంబర్‌ 30న ముగియనున్నాయి. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహిస్తున్నది.

Also Read :తాగింది నిజమే.. వీడియో తీసింది అందుకే..యూట్యూబర్ నాని సంచలన ప్రెస్ మీట్!

ఇక ఈ  పరీక్షలను రెండు షిఫ్టుల్లో నిర్వహించనుండా.. మొదటి షిఫ్ట్‌ పేపర్‌-1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్‌లో పేపర్‌-2 పరీక్షను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు. JEE Main 2024 పరీక్షలో అర్హత సాధించిన 2.5 లక్షల మంది అభ్యర్థులు JEE Advanced 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి, పరీక్ష రాయడానికి అర్హత సాధిస్తారు. పూర్తి వివరాలకోసం https://jeeadv.ac.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు. కంపూట్యర్‌ బేస్డ్‌ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు.

Advertisment
తాజా కథనాలు