తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ లో ఈ సారి కొత్త మార్పులు!

2023-24 విద్యా సంవత్సరానికిగానూ పదో తరగతి పరీక్షల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. రెండు సంవత్సరాల నుంచి ఒకే రోజు నిర్వహిస్తున్న ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక వేరు వేరు రోజుల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది.

New Update
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ లో ఈ సారి కొత్త మార్పులు!

2023-24 సంవత్సరానికిగానూ పదో తరగతి పరీక్షల్లో మార్పు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. రెండు సంవత్సరాల నుంచి ఒకే రోజు చేపడుతున్న ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక రెండు రోజుల్లో నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. అయితే గతంలో తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ కు 11 పేపర్లు నిర్వహించగా హిందీ ఒకటి, మిగతా సబ్జెక్టులు రెండేసి పేపర్లు ఉండేవి. కానీ ఈ రెండేళ్లలో తెలంగాణలో ఆరు పేపర్లతోనే పరీక్షలు పెడుతున్నారు. అయితే ఈసారి మరో కొత్త మార్పు కోసం ఇప్పటికే ఎస్సీఈఆర్టీ అధికారులు వివరణ పంపించగా దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వచ్చే ఛాన్స్ ఉంది.

ఇది కూడా చదవండి : రేపటి నుంచి స్కూళ్లకు సెలవులు.. ఎన్ని రోజులంటే

ఈ మేరకు గతంలో 11 పేపర్లతో నిర్వహిస్తున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలను కరోనా ఎఫెక్ట్ తో 2021- 2022 లో 6 పేపర్లకు కుదించింది అప్పటి గవర్నమెంట్. దీంతో 2022 - 2023 విద్యాసంవత్సరం నుంచి కూడా అదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. కానీ ఫిజిక్స్, బయోలజీ క్వశ్చన్ పేపర్లను మాత్రం వేర్వేరు రోజుల్లో నిర్వహించాలంటూ స్టూడెంట్స్, తల్లిదండ్రులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దీంతో సంబంధిత అధికారులు రెండు రోజుల్లో బయోలజీ, ఫిజిక్స్ పేపర్లు పెట్టాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. అయితే, ఎగ్జామ్ వేర్వేరు రోజుల్లో నిర్వహించినా మార్కులు మాత్రం సైన్స్ సబ్జెక్టుగానే పరిగణిస్తారని అధికారులు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల విద్యార్థలకు టెన్షన్ తగ్గి, సైన్స్ సబ్జెక్టు ప్రిపేర్ అయ్యేందుకు మరింత టైమ్ దొరికే అవకాశం ఉంది. ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ సబ్జెక్టులను ఇక వేర్వేరు రోజుల్లో నిర్వహిణపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు