Hyderabad: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి..

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి, ఇండియన్ ముజాహిదీన్‌ ఉగ్రవాది సయ్యద్‌ మక్బూల్‌ (52) మృతి చెందాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చర్లపల్లి జైల్లో ఖైదీగా ఉంటున్న అతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స తీసుకుంటూ గురువారం ఉదయం ఆసుపత్రిలో మృతి చెందాడు.

New Update
Hyderabad: దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి మృతి..

2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు పేలుళ్లు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 18 మంది మృతి చెందారు. 126 మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ బాంబు పేలుళ్ల కేసు సూత్రధారి.. ఇండియన్ ముజాహిదీన్‌ ఉగ్రవాది సయ్యద్‌ మక్బూల్‌ (52) మృతి చెందాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్‌ జైల్లో ఖైదీగా ఉంటున్న అతడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 30 రోజుల క్రితమే గుండె ఆపరేషన్ జరిగింది. ఆ తర్వత కిడ్నీలు ఫెయిల్ కావడంతో క్రమంగా ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలోనే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున అతడు మృతి చెందాడు.

Also read: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ క్యాలెండర్ పై రేవంత్ కీలక ప్రకటన!

దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో అతడి హస్తం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) గుర్తించింది. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసుల్లో అతడికి ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదిగా శిక్ష విధించింది. ఆరు నెలల క్రితమ సయ్యద్ మక్బూల్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ట్రాన్సిట్ వారెంట్‌పై ఆయన్ని ఢిల్లీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు.

మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన మక్బుల్‌.. ఇండియన్ ముజాహిదీన్‌ వ్యవస్థాపకుడు ఆజం ఘోరీకి సన్నిహితుడనే పేరుంది. అంతేకాదు 2006, 2007లో ముంబయి వరుస పేలుళ్లు, 2008లో జైపూర్, 2008 ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగళూరుతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల వెనుక అతడి పాత్ర ఉందని ఎన్‌ఐఏ తెలిపింది.

Also read: ఇంజినీరింగ్‌ చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్‌.. మరో 9 వేల సీట్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు