Saroornagar : హైదరాబాద్ సరూర్ నగర్(Saroornagar) పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యచారం కేసులో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది రంగారెడ్డి కోర్టు. 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 30వేలు జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ. 10 లక్షలు నష్ట పరిహరం ఇవ్వాలని ఫాస్ట్ ట్రాక్(Fast Track) ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర రావిర్యాల గ్రామానికి చెందిన పందుల నాగరాజు ఆటో డ్రైవర్. కర్మన్ ఘాట్ లో ఉండేవాడు. తొమ్మిదో తరగతి బాలికను ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. మాయమాటలు చెప్పి 2019 మే నెలలో బాలికను ఇబ్రహీంపట్నం వైపు తీసుకెళ్లి సాగర్ రహదారి పక్కన నిర్జన ప్రదేశంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి పద్మావతి నిన్న తుది తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 30వేలు జరిమానా విధించింది. ఈ మేరకు నిందితుడికి తర్వగా శిక్ష పడాలని ఆధారాలను సేకరించిన అధికారులను అభినందించారు రాచకొండ సీపీ సుధీర్ బాబు.