Hyderabad : సరూర్‌నగర్ అత్యచారం కేసులో నిందితుడికి కారాగార శిక్ష హైదరాబాద్ లో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 30వేలు జరిమానా విధించింది. అలాగే, బాధిత బాలికకు రూ.10 లక్షల పరిహారం ముంజూరు చేయాలని తీర్పును వెల్లడించింది. By Jyoshna Sappogula 15 Dec 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Saroornagar : హైదరాబాద్ సరూర్ నగర్(Saroornagar) పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యచారం కేసులో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది రంగారెడ్డి కోర్టు. 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 30వేలు జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి రూ. 10 లక్షలు నష్ట పరిహరం ఇవ్వాలని ఫాస్ట్ ట్రాక్(Fast Track) ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగర రావిర్యాల గ్రామానికి చెందిన పందుల నాగరాజు ఆటో డ్రైవర్. కర్మన్ ఘాట్ లో ఉండేవాడు. తొమ్మిదో తరగతి బాలికను ప్రేమ పేరుతో వెంటపడ్డాడు. మాయమాటలు చెప్పి 2019 మే నెలలో బాలికను ఇబ్రహీంపట్నం వైపు తీసుకెళ్లి సాగర్ రహదారి పక్కన నిర్జన ప్రదేశంలో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి పద్మావతి నిన్న తుది తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 30వేలు జరిమానా విధించింది. ఈ మేరకు నిందితుడికి తర్వగా శిక్ష పడాలని ఆధారాలను సేకరించిన అధికారులను అభినందించారు రాచకొండ సీపీ సుధీర్ బాబు. #Conviction of #accused person sentenced for 20 years #Rigorous_Imprisonment & imposed fine of Rs 30,000 & awarded #victim compensation Rs 10,00,000 to victim in #rape cum #pocsocase in cr no.375/2019 u/s 366, 376 (1), 417, 506 IPC & sec 3 R/W 4 pocso act 2012 of @Saroornagarps. pic.twitter.com/TVqCsQFz9m — Rachakonda Police (@RachakondaCop) December 15, 2023 #telangana #hyderabad #saroornagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి