Unseasonal rains: అకాల వర్షాలు.. పిడుగుపాటుకు గురై 20 మంది మృతి..

గుజరాత్‌లో ఆదివారం అకాల వర్షాల కురవడంతో పిడుగులు పడి 20 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. 16 గంటల్లో 50-117 మి.మీ వర్షపాతం నమోదైంది. పలుచోట్ల వడగండ్ల వర్షాలు కురవండతో తీవ్రంగా పంటలు నష్టం జరిగింది.

New Update
Unseasonal rains: అకాల వర్షాలు.. పిడుగుపాటుకు గురై 20 మంది మృతి..

గుజరాత్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆదివారం పలుచోట్ల అకాల వర్షం కువడంతో.. పలు ప్రాంతాల్లో పిడుగులు పడి 20 మంది మృతిచెందారు. ఈ మేరకు రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్‌ సెంటర్‌ అధికారులు సోమవారం వెల్లడించారు. ఇక గుజరాత్‌లో మొత్తంగా 252 తాలుకాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో 16 గంటల్లో 50-117 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిశాయి. దీంతో పలు ప్రాంతాల్లో తీవ్రంగా పంటలకు నష్టం జరిగింది. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Also read: నెలకు రూ.3 నుంచి 9 లక్షలు సంపాదిస్తున్న ఏఐ మోడల్‌..

అయితే దాహోద్‌ అనే జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు, భరూచ్‌లో ముగ్గురు, తాపి జిల్లాలో ఇద్దరు మరణించినట్లు అధికారులు చెప్పారు. అలాగే అహ్మదాబాద్, అమ్రేలీ, తదితర ప్రాంతాల్లో పిడుగుల ధాటికి 11 మంది మృతి చెందినట్లు పేర్కొన్నారు. అకాల వర్షాలపై 20 మంది మృతిచెందడంతో కేంద్రహోమంత్రి అమిత్‌ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇదిలా ఉండగా.. రాజస్థాన్, మహారాష్ట్రల్లో కూడా నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అయితే గుజరాత్‌, రాజస్థాన్‌లోని కొన్నిప్రాంతాల్లో సోమవారం కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also read: బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. రైతుబంధు పంపిణీకి బ్రేక్..

Advertisment
తాజా కథనాలు