Shock To Spice Jet Airlines : ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న స్పైస్ జెట్(Spice Jet) విమానయాన సంస్థకు మరో ఎదురుదెబ్బ తగిలింది. విమానయాన సంస్థ(Airlines) కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు రాజీనామా చేశారు. స్పైస్‌జెట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శిల్పా భాటియా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అరుణ్ కశ్యప్ రాజీనామా చేశారు. ఈ ఇద్దరు అధికారులు కలిసి కొత్త చార్టర్ ఎయిర్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించనున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.
అక్టోబర్ 2023లో, వారు సంయుక్తంగా సిరియస్ ఇండియా ఎయిర్‌లైన్స్ అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేశారనే వార్తలు సోషల్ మీడియా(Social Media) లో వచ్చాయి. స్పైస్‌జెట్ అనుమతి లేకుండా సిరియస్ ఎయిర్‌లైన్ తదుపరి ఏమీ చేయదని స్పైస్‌జెట్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఇద్దరు అధికారులు స్పైస్‌జెట్‌లో నోటీసు వ్యవధిలో ఉన్నారు. ఇది మార్చి 31న ముగుస్తుంది.
అరుణ్ కశ్యప్(Arun Kashyap) గతంలో కూడా కంపెనీని విడిచిపెట్టారు
అరుణ్ కశ్యప్ ఇప్పటికే 2022లో స్పైస్‌జెట్‌ను విడిచిపెట్టారు. ఎయిరిండియాలో చీఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫీసర్‌గా చేరారు. అయితే ఏడాది తర్వాత ఎయిర్ ఇండియాను వదిలి స్పైస్‌జెట్‌లో చేరాడు. కశ్యప్‌కు జెట్ ఎయిర్‌వేస్, ఒమన్ ఎయిర్‌లలో పనిచేసిన అనుభవం కూడా ఉంది.
షేర్లలో భారీ పతనం
ఇద్దరు సీనియర్ అధికారుల రాజీనామా వార్తల కారణంగా స్పైస్‌జెట్ షేర్లలో మంగళవారం భారీ పతనం జరిగింది. ప్రారంభ ట్రేడింగ్‌లో స్పైస్‌జెట్ షేర్లు 6.82 శాతం లేదా రూ.4.13 పడిపోయి రూ.56.45 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,859.67 కోట్లకు పడిపోయింది. గత నెలలో స్పైస్‌జెట్ షేర్ ధర 11.99% పడిపోయింది. అయితే, ఇది గత 6 నెలల్లో 41.66%, ఒక సంవత్సరంలో 66.28% సానుకూల రాబడిని ఇచ్చింది. ఈ షేర్ 52 వారాల గరిష్టం రూ.77.50. కాగా, 52 వారాల కనిష్ట ధర రూ.22.65 గా ఉంది.
Also Read : డార్లింగ్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన సీతారాం భామ!