Portugal Air Show : పోర్చుగల్ ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. షో జరుగుతుండగా గాల్లోనే రెండు విమానాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి (Plane Collide). గాల్లో 6 విమానాలు కలిసి విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బెజా ఎయిర్‌పోర్టు (Beza High Court) లో శనివారం నుంచి 30ఏరోబాటిక్ బృందాలతో ఎయిర్‌షో నిర్వహిస్తున్నారు. నిన్న యాక్ స్టార్స్ అనే ఏరోబాటిక్ గ్రూప్ విన్యాసాలు చేస్తుండగా అనుకోకుండా ప్రమాదం సంభవించింది.ఈ విమానాలు యకోవ్ లెవ్ యాక్-52రకానికి చెందినవిగా గుర్తించారు.
ఎయిర్ షో సందర్భంగా ముందు ఒకేసారి 6 విమానాలు గాల్లోకి లేచాయి. ఓ ప్లేన్ ను మిగిలిన విమానాలను క్రాస్ చేసి వెళ్లే క్రమంలో రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా రెండు విమానాలు కుప్పకూలిపోయాయి. దాంతోపాటూ విమానాలు కింద పడగానే మంటలు ఎగిసిపడ్డాయి. అదే మంటల్లో విమానాల్లోని ఒక పైలట్ కాలిపోయారు (Pilot Dead). మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో గుర్తిస్తామని పోర్చుగల్ రక్షణమంత్రి నునో మెలో తెలిపారు.
మరోవైపు ఈ విమానాల ప్రమాదం తాలూకా ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఓ వీక్షకుడు తన కెమెరాలో బంధించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.