Portugal : పోర్చుగల్ ఎయిర్ షోలో విషాదం.. గాల్లో ఢీకొన్న విమానాలు పోర్చుగల్‌లో రెండు విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. అక్కడ జరుగుతున్న ఎయిర్ షోలో ఈ సంఘటన జరిగింది. ఇందులో ఓ పైలట్ దుర్మరణం చెందగా..మరొకరి తీవ్ర గాయాలయ్యాయి. By Manogna alamuru 03 Jun 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Portugal Air Show : పోర్చుగల్ ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది. షో జరుగుతుండగా గాల్లోనే రెండు విమానాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి (Plane Collide). గాల్లో 6 విమానాలు కలిసి విన్యాసాలు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బెజా ఎయిర్‌పోర్టు (Beza High Court) లో శనివారం నుంచి 30ఏరోబాటిక్ బృందాలతో ఎయిర్‌షో నిర్వహిస్తున్నారు. నిన్న యాక్ స్టార్స్ అనే ఏరోబాటిక్ గ్రూప్ విన్యాసాలు చేస్తుండగా అనుకోకుండా ప్రమాదం సంభవించింది.ఈ విమానాలు యకోవ్ లెవ్ యాక్-52రకానికి చెందినవిగా గుర్తించారు. ఎయిర్ షో సందర్భంగా ముందు ఒకేసారి 6 విమానాలు గాల్లోకి లేచాయి. ఓ ప్లేన్ ను మిగిలిన విమానాలను క్రాస్ చేసి వెళ్లే క్రమంలో రెండు విమానాలు ఢీకొట్టుకున్నాయి. దీంతో ఒక్కసారిగా రెండు విమానాలు కుప్పకూలిపోయాయి. దాంతోపాటూ విమానాలు కింద పడగానే మంటలు ఎగిసిపడ్డాయి. అదే మంటల్లో విమానాల్లోని ఒక పైలట్ కాలిపోయారు (Pilot Dead). మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ జరిపి ప్రమాదానికి దారితీసిన కారణాలేంటో గుర్తిస్తామని పోర్చుగల్ రక్షణమంత్రి నునో మెలో తెలిపారు. మరోవైపు ఈ విమానాల ప్రమాదం తాలూకా ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను ఓ వీక్షకుడు తన కెమెరాలో బంధించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. Beja Air Show accident 😨😞 DEP pic.twitter.com/4WrRfoLCeO — Don Expensive 🇪🇦 ✞ 🐸 (@kar0____) June 2, 2024 Also Read:కవితకు దక్కని ఊరట..జులై 3 వరకు రిమాండ్ #pilot-dead #plane-collide #portugal-air-show #flights మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి