COVID For Olympics Athletes: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ఒలింపిక్ సిరీస్‌ను ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో (Paris) ఆగస్టు 26 నుంచి 11వ తేదీ వరకు జరుపుకోనున్నారు. 1924లో ఫ్రాన్స్‌లో ఒలింపిక్ క్రీడలు జరిగాయి. 100 ఏళ్ల తర్వాత మళ్లీ ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఫ్రాన్స్ సిద్ధమైంది. లండన్ తర్వాత 3వ సారి ఒలింపిక్ సిరీస్‌కు ఆతిథ్యమిచ్చిన ఘనత పారిస్‌కు దక్కింది.
ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అథ్లెట్లు పారిస్ చేరుకున్నారు. వీరిలో ఆస్ట్రేలియా కు (Australia) చెందిన ఇద్దరు అథ్లెట్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో వారిద్దరని మేనేజ్ మెంట్ ఐసోలేషన్ కు తరలించారు.
ఈ క్రమంలో వారిద్దరు ఇంక ఎవరెవరిని కలిశారను సభ్యులు విచారణ చేపట్టారు. మరోవైపు కరోనా వ్యాప్తి చెందుతుందా? అనే భయం క్రీడాకారుల్లో, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.ఈ ప్రతిష్టాత్మక మైదానానికి ఈసారి భారతదేశం నుండి 100 మందికి పైగా క్రీడాకారులు అర్హత సాధించారు.ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో 30 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు.
Also Read: పారిస్ ఒలింపిక్స్ బరిలోకి భారత్ నుంచి 14 ఏళ్ల బాలిక