Job Notification : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాష్ట్రపతి ఉత్తర్వులు యథేచ్ఛగా ఉల్లంఘించారని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్ (KTR). నాన్‌లోకల్ కోటా పేరిట తెలంగాణ యువతకు (Telangana Youth) తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 95 శాతం స్థానికత కోటా లేదని పేర్కొన్నారు. అటెండర్ ఉద్యోగం నుంచి గ్రూప్-1 అధికారి వరకు 95శాతం ఉద్యోగాలకు స్థానిక రిజర్వేషన్లు తాము తెచ్చినట్లు చెప్పారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ (Congress) పదేళ్ల పాలనలో 26,084 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని అన్నారు. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ యువతకు 10 వేల ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గత పదేళ్లలో 2.37లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిందని అన్నారు.
Also Read : బాచుపల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. సుత్తి, కత్తి సాయంతో కాలు, చేయిని సగం వరకు నరికి..!