Mumbai: ముప్పై ఏళ్ల క్రితం ఆ నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. మళ్లీ వాళ్లకు దొరకలేదు. గుట్టుచప్పుడు కాకుండా అతడు తన ఇంటికి వెళ్తుండగా ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. 1993లో ముంబయిలో అల్లర్లు చెలరేగాయి. ఈ సమయంలో చట్టవిరుద్ధంగా మనుషులను తీసుకొచ్చిన కేసుతో పాటు.. ఓ హత్య కేసులో సయ్యద్ నాదిర్ షా అబ్బాస్ ఖాన్ (Sayyad Nadir Shah Abbas Khan - 65)ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు.
Also Read: నీట్ పై చర్చ జరగాలి.. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ లేఖ
బెయిల్‌పై రిలీజ్ అయినప్పటి నుంచి అతడు పోలీసుల కంట పడకుండా పరారీలో ఉన్నాడు. దీంతో కోర్టు అబ్బాస్ ఖాన్‌ను పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. సెంట్రల్ ముంబయి అయిన సేవ్రీలో ఉంటున్న నిందితుడి కోసం పోలీసులు గాలించారు. అయినప్పటికీ అతడు దొరకలేదు. చివరికి బంధువుల ఫొన్ల రికార్డులను పరిశీలించగా ఆచూకీ దొరికింది. జూన్ 29న అతడు ఇంటికి వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. పోలీసులు ప్లాన్ వేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 1993లో అల్లర్ల కేసుకు సంబంధించి బెయిల్‌పై విడుదలైన అతడిని మళ్లీ ఇప్పుడు అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.
Also Read: ఢిల్లీ విమానాశ్రయంలో రూ.22 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం!