Punjab : సిక్కుల పవిత్ర గ్రంథం పేజీలు చింపినందుకు యువకుడు దారుణ హత్య

పంజాబ్‌లోని ఓ గురుద్వారలో దారుణం చోటుచేసుకుంది. సిక్కులు పవిత్ర గ్రంథంగా భావించే గురు గ్రంథ్ సాహిబ్‌ బుక్‌లో కొన్ని పేజీలను చింపినందుకు ఓ 19 ఏళ్ల యువకుడిని కొట్టి చంపేశారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Murder : పంజాబ్‌(Punjab) లోని ఓ గురుద్వారలో దారుణం చోటుచేసుకుంది. సిక్కులు పవిత్ర గ్రంథంగా భావించే 'గురు గ్రంధ సాహిబ్‌' బుక్‌లో కొన్ని పేజీలను చింపినందుకు ఓ 19 ఏళ్ల యువకుడిని కొట్టి చంపేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఫిరోజ్‌పూర్ జిల్లాలోని తల్లిగులాం గ్రామనికి బక్షిశ్ సింగ్ అనే 19 ఏళ్ల యువకుడు శనివారం నాడు బండాల గ్రామంలో ఉన్న గురుద్వార ప్రాంగణంలోకి వచ్చాడు. దీంతో అతడు తనకు కనిపించిన గురు గ్రంధ సాహిబ్‌ బుక్‌లో కొన్ని పేజీలను చింపేశాడు. ఇది గమనించిన అక్కడి స్థానికులు అతడిని పట్టుకునేందుకు వచ్చారు. బక్షిశ్ భయంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ వాళ్లందరూ కలిసి అతడిని పట్టుకుని చితకబాదారు.

Also Read: రానున్న 4 రోజుల్లో 48 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు..

చివరికి తీవ్రమైన దెబ్బలతో బక్షిశ్ సింగ్ మృతి చెందాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. శ్రీ గురు గ్రంధ సాహిబ్ సత్కార్ కమిటీ(Sri Guru Granth Sahib Satkar Committee) ఛైర్మన్ లఖ్విర్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు బక్షిష్ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేశారు. మరోవైపు బక్షిశ్ సింగ్ వాళ్ల నాన్న లఖ్విందర్ సింగ్.. పోలీసుల చర్యపై ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నాడని.. ప్రస్తుతం అతనికి ట్రీట్‌మెంట్ జరుగుతోందని చెప్పాడు. తన కొడుకు మృతికి కారకులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read: సెక్స్‌ స్కాండల్‌ కేసులో మాజీ మంత్రి అరెస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు