నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఈస్ట్ సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో రైల్వేలోని ఈ జోన్ లో 1832 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ప్లాంట్ డిపో, మొఘల్ సరాయ్, మెకానికల్ వర్క్ షాప్, సమస్తిపూర్, క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్, హర్నాట్, ధన్ బాద్ డివిజన్, మొఘల్ సరాయ్ డివిజన్, తూర్పు మధ్య రైల్వేలోని సమస్తిపూర్ డివిజన్లలో అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ కోసం ఈ రిక్రూట్ మెంట్ జరగనుంద. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అధికారిక వెబ్ సైన్ https://actappt.rrcecr.in ను చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 9 లేదా అంతకుముందే దరఖాస్తులు సమర్పించాలి.
ఖాళీలు :
దానాపూర్ డివిజన్-675
ధన్‌బాద్ డివిజన్-156
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ డివిజన్-518
సోన్‌పూర్ డివిజన్-47
సమస్తిపూర్ డివిజన్-81
ప్లాంట్ డిపో-135
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్-110
మెకానికల్ వర్క్‌షాప్-110
అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50శాతం మార్కులతో పదో తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాదు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాస్ అయి ఉండాలి. వయోపరిమితి కనిష్టంగా 15ఏళ్లు. గరిష్టంగా 24ఏళ్లు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టవయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
రైల్వేలో అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ మెరిట్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు. ముఖ్యంగా పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ మెరిట్ ఉండనుంది.
ఇలా దరఖాస్తు చేసుకోండి:
-మొదట ఈస్ట్ సెంట్రల్ రైల్వే వెబ్‌సైట్ www.rrcecr.gov.inకి వెళ్లండి.
-అనంతరం హోమ్ పేజీలో ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేసి లాగిన్ అవ్వండి.
-ఇప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి.
- ఫారమ్ నింపేటప్పుడు జిస్ట్రేషన్ సమయంలో, 12 అంకెల ఆధార్ కార్డ్ నంబర్‌ను కూడా నింపాలి.
-అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
-ఇప్పుడు చివరిగా సమర్పించిన ఫారమ్ కాపీని ప్రింట్ అవుట్ తీసి మీ వద్ద ఉంచుకోండి.
ఇది కూడా చదవండి: ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్ చెల్లదు.. హర్యానా హైకోర్టు సంచనల తీర్పు..