Lok Sabha Canceled : ఎన్నికలు (Elections) ముగిశాయి. ఫలితాలు వచ్చేశాయి. రేపో, మాపో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరో కూడా తేలిపోతుంది. దాని కంటే ముందు ఇప్పటి వరకు ఉన్న లోక్‌సభను రద్దు చేయాల్సి ఉంటుంది. కొత్త గవర్నమెంట్ భాద్యతలు చేపట్టాలంటే పాత ప్రభుత్వం ఉండకూడదు. అందుకే ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో 17వ లోక్ సభను రద్దు చేస్తూ ఓ తీర్మానం చేశారు.
ఆ తీర్మానాన్ని రాష్ట్రపతి ముర్ముకు పంపించారు.
ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాక కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కలుగుతుంది.
Also read:National: రేపు పీఎం అభ్యర్థిని ప్రకటిస్తాం-ఇండియా కూటమి