Breaking: మరో 50 మంది ఎంపీలు ఔట్.. స్పీకర్ సంచలన నిర్ణయం!

పార్లమెంట్‌ లో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. సోమవారం నాడు 79 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా..మంగళవారం నాడు 50 మంది ఎంపీలను సభ సస్పెండ్‌ చేసింది.

New Update
Lok Sabha : లోక్ సభ ను రద్దు చేస్తూ తీర్మానం

పార్లమెంట్‌ లో ఎంపీల సస్పెన్షన్ పరంపర కొనసాగుతుంది. సోమవారం నాడు 79 మంది ఎంపీలను సస్పెండ్ చేయగా..మంగళవారం నాడు 50 మంది ఎంపీలను సభ సస్పెండ్‌ చేసింది.ఈరోజు సస్పెండ్ అయిన వారిలో సీనియర్ నేత శశిథరూర్‌, సుప్రియా సూలే ఉన్నారు.

గతవారం లోక్‌ సభలో జరిగిన భద్రతా ఉల్లంఘనపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో నిరసనలు చేపట్టారు. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు లోక్‌సభ ఛాంబర్‌ లోనికి ప్రవేశించి , స్మోక్‌ బాంబులను ప్రయోగించడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ భద్రతా వైఫల్యం గురించి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా మాట్లాడాలని వెంటనే వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

దీంతో ఎంపీలు సభ నియామాలు ఉల్లంఘించి సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించడంతో రెండు సెషన్లు కలిపి మొత్తం 92 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేసినట్లు ఇరు సభల సభాపతులు వివరించారు. సోమవారం నాడు మొత్తంగా 79 మంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు.

మంగళవారం కూడా అదే పరంపర కొనసాగింది. ఈరోజు 50 మంది ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ ఓం బిర్లా ప్రకటించారు. దీంతో ఇరు సభల నుంచి మొత్తం 139 మంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు. సస్పెండ్‌ అయిన వారిలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా, కాంగ్రెస్‌ నేతలు శశి థరూర్‌, కార్తీ చిదంబర్‌, ఎన్‌సీపీ నేత సుప్రియా సూలే, సమాజ్‌ వాది పార్టీకి చెందిన డింపుల్‌ యాదవ్‌ లు ఉన్నట్లు సమాచారం.

Also read: త్వరలో 14 వేల ఉద్యోగాలకు ప్రకటన.. మంత్రి సీతక్క శుభవార్త!

Advertisment
తాజా కథనాలు