ముంబయిలోని ఘాట్‌కోపర్‌లో బలమైన ధూళి తుఫాన్ ప్రభావానికి పెట్రోల్ పంపుపై 100 అడుగుల ఎత్తున్న ఓ భారీ హోర్డింగ్ పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 14 మంది చనిపోగా.. 74 మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రలకు చికిత్స కొనసాగుతంది. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన అనంతరం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో చికిత్స అందించి, మృతులకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే ముంబైలో ఎక్కడ హోర్డింగ్‌లు ఏర్పాటు చేసినా ఆడిట్ చేయాలని ఆదేశించారు.
Also Read: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ కన్నుమూత!
ఇదిలాఉండగా.. గత కొద్ది రోజులుగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ గత వారం రాయ్‌గఢ్, మరాఠ్వాడాకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అయితే సోమవారం ముంబయిలో అకస్మాత్తుగా బలమైన గాలులు వీయడం ప్రారంభించాయి. కొన్ని చోట్ల వర్షం పడింది. ఈ దుమ్ముతుపాను కారణంగా చాలా మంది మృతి చెందినట్లు సమాచారం.
Also Read: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రాహుల్ గాంధీ.. క్లారిటీ వచ్చేసినట్లేనా?