హజ్‌లో మక్కా మసీదు దగ్గర 14మంది జోర్డానియన్లు మరణించారు. మరో 17మంది తప్పిపోయారు. ఈ విషయాన్ని జోర్డాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈద్-ఉల్-అజా పండుగ కోసం సౌదీ అరేబియాకు పెద్ద సంఖ్యలో హజ్ యాత్రికులు తరలివచ్చారు. అయితే..ఇక్కడ తీవ్రమైన ఎండలు, వేడితో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హజ్ సమయంలో 47 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. దీనివలన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మక్కాలో విపరీతమైన వేడిమి కారణంగా ఆరుగురు మరణించారు.
ఇక ఈ ఏడాది హజ్ యాత్రలో 1.8 మిలియన్లకు పైగా యాత్రికులు పాల్గొనే అవకాశం ఉంది. బుధవారంతో ముగియనున్న హజ్ ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక సమావేశాలలో ఒకటి. ముస్లింలు ఒక్కసారైనా వెళ్ళాలనుకునే పవిత్ర స్థలం. ఇక్కడకు అందరూ ఒక్కసారిగా భక్తులు, యాత్రికులు వస్తుంటారు. ఈ కారణంగా చాలాసార్లు తొక్కిసలాటలు, డేరా మంటలు, వేడి, ఇతర కారణాలతో గత 30 సంవత్సరాలలో వందలాది మంది మరణించారు.
Also Read:Telangana: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్…