Dasara Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్..దసరా సెలవులు ఖరారు...ఎన్ని రోజులంటే..!! తెలుగు రాష్ట్రాలు స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులను ఖరారు చేశాయి. ఈ సారి తెలంగాణ, ఏపీలో దసరా సెలవులను సమానం ఇచ్చాయి ప్రభుత్వాలు. తెలంగాణలో మొత్తం 13 రోజుల దసరా సెలవులు ఇవ్వగా...అటు ఏపీలోనూ 13రోజులు సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. By Bhoomi 01 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ తెలంగాణ New Update షేర్ చేయండి ఏపీలో స్కూల్స్, కాలేజీలకు దసరా సెలవులను ఖరారు చేసింది సర్కార్. ఈ సారి తెలంగాణ, ఏపీలో దసరా సెలవులు సమానంగా ఇచ్చారు. తెలంగాణలో 13 రోజులు దసరా సెలవులు ఇవ్వగా...అటు ఏపీలోనూ 13రోజులు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. అక్టోబర్ 13 నుంచి దసరా సెలవులను ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలిపింది. ఈ సెలవులు అక్టోబర్ 13 నుంచి మొదలై అక్టోబర్ 25వరకు ఉంటాయి. అక్టోబర్ 5 నుంచి 11 వ తేదీ వరకు ఎస్ ఏ 1 పరీక్షలు నిర్వహించనుంది. ఎనిమిదవ తరగతి విద్యార్థులు మినహా...మిగిలిన అన్ని తరగతుల విద్యార్థులకు ఉదయం పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా అక్టోబర్ 25వరకు వరసగా సెలవులు ఉండగా...26వ తేదీ నుంచి పాఠశాలల తిరిగి ప్రారంభం అవుతాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అదికారులు షెడ్యూల్ నుకూడా విడుదల చేశారు. ఏపీ స్కూళ్లకు సంబంధించి 2023-24 అకాడమిక్ క్యాలెండర్ లో ఈసెలవులు పూర్తి వివరాలను విద్యాశాఖ పొందుపరిచింది. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త..ఈ ప్రభుత్వ సంస్థలో వెయ్యికి పైగా పోస్టులకు రిక్రూట్ మెంట్…పూర్తి వివరాలివే..!! ఇక క్రిస్టమస్ సెలవులను కూడా 7 రోజుల నుంచి 5రోజులకు తగ్గించారు. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. ప్రతి నెలా మూడో శనివారం పేరెంట్, టీచర్ మీటింగ్స్ నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశించింది. ప్రతినెల మొదటివారంలో పాఠశాల విద్యా కమిటీ సమావేశాలు జరగాలి. తెలంగాణలో ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం..ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త…స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువు పెంపు..పూర్తి వివరాలు ఇవే..!! ఇకపాఠశాలలు జూన్ 12న ప్రారంభం అయి...ఏప్రిల్ 23, 2024న ముగుస్తాయి. ఈ అకాడమిక్ ఇయర్ లో మొత్తం 2229 రోజులపాటు స్కూల్స్ పనిచేయాల్సి ఉంటుంది. 2024 ఏప్రిల్ 24 నుంచి 2024జూన్ 11వరకు 49రోజులు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఈ ఏడాది దసరా సెలవులు..అక్టోబర్ 13 నుంచి 25 వ తేదీ వరు 13రోజులు ఉంటాయని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వుల్లో స్పష్టం చేశాయి. #telangana #ap #government #dasara-holidays మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి