Himachal Pradesh : విరిగిపడిన కొండచరియలు..128 రోడ్లు మూసివేత!

హిమాచల్ ప్రదేశ్‌ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడుతుండడంతో దాదాపు 128 రోడ్లను అధికారులు తాత్కలికంగా మూసివేశారు. అలాగే, శనివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Himachal Pradesh : విరిగిపడిన కొండచరియలు..128 రోడ్లు మూసివేత!
New Update

Landslides : హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతుండడంతో దాదాపు 128 రోడ్లను అధికారులు తాత్కలికంగా మూసివేశారు. అలాగే, శనివారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆగస్టు 15వ తేదీ వరకు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని పేర్కొనింకాగా, మండి, బిలాస్‌పూర్, సోలన్, సిర్మౌర్, సిమ్లా, కులు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అలాగే రాష్ట్రంలోని కాంగ్రా, సిర్మౌర్‌, హమీర్‌పూర్‌, ఉనా వంటి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నటలు అధికారులు తెలిపారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశాలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే, బలమైన ఈదురు గాలులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి ఎద్దడి కారణంగా పంటలు, ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, ఇప్పటికే మండిలో 60, కులులో 37, సిమ్లాలో 21, కాంగ్రాలో ఐదు, కిన్నౌర్‌లో నాలుగు, హమీర్‌పూర్ జిల్లాలో రహదారులను అధికారులు మూసివేసినట్లు తెలిపారు. అయితే, గురువారం సాయంత్రం నుంచి మండి జిల్లాలోని జోగిందర్‌నగర్‌లో అత్యధికంగా 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుఫ్రిలో 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆగస్టు 9 వరకు రాష్ట్రంలో వర్షపాతం లోటు 28 శాతంగా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్‌లో 321.8 మిమీ వర్షపాతం నమోదైంది.

Also read: నేడు వయనాడ్‌ కి ప్రధాని మోదీ..!

#landslides #heavy-rains #himachal-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe