Big Breaking: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.బుధవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య దాదాపు ఆరు గంటల పాటు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోలు హతమయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ సతీశ్ పాటిల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలం నుంచి అనేక ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఎన్ కౌంటర్ లో హతులైన మావోయిస్టుల్లో ఇద్దరు తెలుగు వాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 7 సీ60 కమాండో దళాలు వందోలి గ్రామం వద్ద నక్సల్స్ మీటింగ్ ఉందన్న పక్కా సమాచారంతో కూంబింగ్ కు బయల్దేరాయి. ఈ సందర్భంగా సీ60 కమాండో బలగాలకు, మావోయిస్టులకు మధ్య సుమారు ఆరు గంటలకు పైగా భీకర కాల్పులు జరిగాయి. కాగా, మృతి చెందిన వారిలో సీనియర్ డివిజనల్ కమిటీ మెంబర్ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
Also read: అమెరికా నుంచి బ్రిటన్ వరకు.. ఎక్కడ చూసినా లీడర్లు మనోళ్లే!