BREAKING: ప్రాణం తీసిన పతంగి సరదా

రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో లో విషాదం చోటు చేసుకుంది. గాలిపటం ఎగరవేస్తూ 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పతంగి ఎగరవేస్తుండగా విద్యుత్ తీగలకు తగడంతో కరెంటు షాక్ తగిలి తనిష్క్ అనే బాలుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.

New Update
BREAKING: ప్రాణం తీసిన పతంగి సరదా

School Boy Died While Flying Kite: సంతోషాలను నింపే సంక్రాంతి పండుగ ఓ ఇంట విషాదాన్ని నింపింది. సంక్రాంతి సెలవులు వచ్చాయని సరదాగా దోస్తులతో కలిసి గాలిపటం ఎగురవేయడం ఓ బాలుడికి చివరి రోజుగా మారింది. గాలిపటం ఎగరవేస్తూ 11 ఏళ్ల బాలుడు మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో చోటు చేసుకుంది. పతంగి ఎగరవేస్తుండగా విద్యుత్ తీగలకు తగడంతో కరెంటు షాక్ తగిలి తనిష్క్ అనే బాలుడు అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. కాళ్ళ ముందే తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా అందరిని దిగ్బ్రాంతికి గురి చేసింది.

ALSO READ: చంద్రబాబుతో భేటీ.. షర్మిల ఏమన్నారంటే?

ప్రాణాలు తీస్తున్నాయి..

సంక్రాంతి పండుగ వచ్చిందంటే అందరి ఇండ్లల్లో సంబరాలు ఆకాశాన్ని అంటుతాయి. కానీ, ఈ సంబరాలు కొందరి ఇండ్లల్లో విషాదాలు నింపుతున్నాయి. ఎలా అని అంటారా?..  సంక్రాంతి పండుగ నేపథ్యంలో అందరు గాలిపటాలు ఎగురవేస్తారు.. దాంట్లో ఏముంది అంటారా?.. అసలు విషయం వేరే ఉంది. గాలిపటం ఎగురవేసేందుకు వాడే దారం.. గత కొన్ని ఏండ్లుగా ఎంతో మంది ప్రాణాలు తీసింది. గాలిపటాలు ఎగురవేసేందుకు వాడే మాంజా దారం వల్ల చాలా మంది రోడ్డు మీద వెళ్లే వారు వారికి తెలియకుండానే ప్రాణలు కోల్పోతున్నారు. ఎగరవేసే సమయంలో పతంగి తెగి కింద పడుతుంది లేదా కరెంట్ పొల్లకు చిక్కుకుపోతాయి ఆ సమయంలో పతంగికి ఉన్న మాంజా  రోడ్డుపై అలానే ఉంటాయి.. అవి సరిగ్గా కనిపించవు.. మాంజా దారలు చాలా షార్ప్ గా ఉంటాయి. వేగంగా బండ్ల మీద వెళ్లే వారికి ఇది కనిపించకపోవడంతో మెడకాయ తెగి ప్రాణాలు కోల్పోతున్నారు. బండ్లపై వెళ్లే వారు జాగ్రత్త ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ALSO READ: రైతులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

Advertisment
తాజా కథనాలు