తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు అధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ పరీక్షలు జరగనున్నాయని పేర్కొంది. మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న థర్డ్ లాంగ్వేజ్ పరీక్షలు జరగనున్నాయి. 23 న మ్యాథ్స్, 26న ఫిజికల్ సైన్స్, 28న బయోలాజికల్ సైన్స్, 30న సోషల్ స్టడీస్, ఏప్రిల్ 1, 4న సంస్కృతం, అరబిక్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలన్నీ ఉదయం 9.30 AM నుంచి మధ్యాహ్నం 12.30 PM గంటల వరకు నిర్వహించనున్నారు.
Also Read: 2020 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం