Ayodhya Ram Mandir : అయోధ్యలో వెలిగిన 108 అడుగుల అగరుబత్తి అయోధ్య రాముడిపై భక్తితో గుజరాత్ కు చెందిన బిహాభాయ్ భర్వాద్ తన గ్రామస్తుల సహయంతో తయారు చేసిన 108 అడుగుల అగరుబత్తిని మంగళవారం అయోధ్యలో వెలిగించారు. By Madhukar Vydhyula 16 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి 108 Feet Agarbatti in Ayodhya: జనవరి 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. అయోధ్యలో రామమందిరానికి (Ayodhya Ram Mandir) ప్రాణప్రతిష్ట నేపథ్యంలో దేశవ్యాప్తంగా రామనామ జపం జోరందుకొంటుంది. ఎవరిని కదిలించిన అయోధ్యను గురించిన ముచ్చట్లే. ఎవరికి తోచినట్లు వారు తమ భక్తిని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గుజరాత్ లోని వడోదరకు (Vadodara) చెందిన బిహాభాయ్ భర్వాద్ (Viha Bharwad) రామ భక్తుడు. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగర్‌బత్తిని తయారు చేశాడు. అంతేకాదు దాన్ని అయోధ్యకు చేర్చాడు. ఈ అగర్‌బత్తి నెలన్నర వరకు వెలుగుతుంది. అగర్‌బత్తి తయారీలో 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్, 1475 కిలోల ఆవుపేడ ఉపయోగించారు. ఈ అగర్‌బత్తి బరువు 3,400 కిలోలు. గ్రామస్థులు మొత్తం ఈ అగర్‌బత్తి తయారీలో పాలుపంచుకున్నారు. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన తర్సాలీ గ్రామం ఈ భారీ అగర్‌బత్తీని తయారుచేసింది. ఈ అగరు బత్తీ తయారు చేయటానికి రెండు నెలల సమయం పట్టిందని.. దీని తయారీకి రూ.5 లక్షలు ఖర్చు అయ్యిందని తెలిపారు. #WATCH | #Ayodhya | The 108-feet incense stick, that reached from #Gujarat, was lit in the presence of Shri Ram Janmabhoomi Teerth Kshetra President Mahant Nrityagopal Das ji Maharaj #RamMandirPranPratishta ceremony to be held on Jan 22#ramtempleconsecration #RamTemple pic.twitter.com/d7rwtOoH0N — Odisha News Tune (@OdishaNewsTune) January 16, 2024 Also Read: 14 లక్షల దీపాలతో రాముడి ఫొటో.. వీడియో వైరల్! అయోధ్య చేరిన ఈ అగర్‌బత్తిని మంగళవారం శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర అధ్యక్షుడు మహంత్ నృత్యగోపాల్‌దాస్ జీ మహారాజ్ (Nritya Gopal Das) సమక్షంలో ముట్టించారు. పలువురు ఆలయ పెద్దలు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున దీనికి హాజరయ్యారు. ఈ అగరుబత్తిని వెలిగించడం వల్ల ప్రత్యేకంగా ధూపం వేయాల్సిన అవసరం ఉండదు. జనవరి 11న జరిగే రామమందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ప్రధాని మోడీతో (PM Modi) పాటు దేశవ్యాప్తంగా 7వేల మంది ప్రముఖులు, దేశం నలుమూలల నుండి రామభక్తులు పాల్గొంటారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుంది. అయోధ్యలో అనేక నూతన నిర్మాణాలను కూడా చేపట్టింది. విమానశ్రయం, రైల్వే స్టేషన్ లను అందంగా తీర్చిదిద్ధింది. 22న అయోధ్య చేరేలా పలు రాష్ట్రాలు ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నాయి. అతిథుల రాక సందర్భంగా ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లను చేస్తుంది. #gujarat #ayodhhya-ram-mandir #agarbatti మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి