Viral Video : 49 ఏళ్ల మహిళను పెళ్లాడిన 103 ఏళ్ల తాత.. అలా ఉండలేకపోతున్నా అంటూ! 103 సంవత్సరాల స్వాతంత్య్ర సమరయోధుడు 49 ఏళ్ల మహిళను మూడో వివాహం చేసుకున్నాడు. ఈ వయసులో ఒంటరితనాన్ని అనుభవించలేకనే పెళ్లి చేసుకున్నట్లు భోపాల్ కు చెందిన 103 ఏళ్ల ఫ్రీడమ్ ఫైటర్ హబీబ్ నాజర్ తెలిపారు.ప్రస్తుతం వీరి వివాహం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Bhavana 30 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Freedom Fighter Got Married : 49 ఏళ్ల మహిళన పెళ్లాడిన 103 ఏళ్ల స్వాతంత్య్ర సమరయోధుడు(Freedom Fighter). ఈ సంఘటన మధ్య ప్రదేశ్(Madhya Pradesh) లోని భోపాల్(Bhopal) జరిగింది. తాత ఇద్దరు భార్యలు మరణించడంతో ఒంటరిగా ఉండలేకపోతున్న అంటూ మూడో వివాహం చేసుకున్నానని ఆయన వివరించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారింది. భోపాల్ కు చెందిన ఫ్రీడమ్ ఫైటర్ హబీబ్ నాజర్(Freedom Fighter Habeeb Najjar) వయసు 103 సంవత్సరాలు. ఆయనకు ఇంతకు ముందే రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఆయన ఇద్దరు భార్యలు కూడా అనారోగ్య కారణాలు, వయసు మీద పడడం వల్ల మరణించారు. అయితే నాజర్ మాత్రం 103 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఎంతో ఆరోగ్యంగా , చలాకీగా ఉన్నారు. దాంతో ఈ వయసులో ఒంటరిగా ఉండటం ఎందుకు అనుకొని మూడో పెళ్లి చేసుకున్నారు. 49 ఏళ్ల కుల్జామా(Kuljama) అనే మహిళను ఆయన వివాహం చేసుకుని ఆటోలో వెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. దీంతో ఆయనకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కుల్జామాకు కూడా ఇది రెండవ వివాహమే. ఆమె భర్త చనిపోవడంతో ఆమె కూడా ఒంటరిగా ఉండలేక నాజర్ ను పెళ్లి చేసుకున్నట్లు వివరించారు. ఇందులో ఎవరి బలవంతం లేదని నా ఇష్ట ప్రకారమే వివాహం చేసుకున్నాను అని ఆమె తెలిపారు. నా భర్త పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె వివరించింది. Also read: నల్ల మిరియాల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే అసలు వదిలిపెట్టరు! #madhya-pradesh #bhopal #freedom-fighter #third-marriege మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి