Kanpur: స్కూళ్లో బాంబ్ పెట్టాం అంటూ ఇమెయిల్.. సెలవు ప్రకటన

కాన్పూర్ లోని 10 స్కూళ్లల్లో బాంబ్ పెట్టమని పోలీసులకు ఇమెయిల్ రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది స్కూళ్లకు సెలవు ప్రకటించారు. రష్యా సర్వర్ నుంచి ఇమెయిల్ వచ్చినట్లు గుర్తించారు. ఇటీవల ఢిల్లీలో దాదాపు 100 స్కూళ్లకు బాంబ్ బెదిరింపు మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే.

New Update
Kanpur: స్కూళ్లో బాంబ్ పెట్టాం అంటూ ఇమెయిల్.. సెలవు ప్రకటన

Kanpur: కాన్పూర్‌లో ఉన్న స్కూళ్లల్లో బాంబ్ పెట్టినట్లు పోలీసులకు బెదిరింపు ఇమెయిల్ రావడం కలకలం రేపింది. దాదాపు అక్కడ ఉన్న 10 స్కూళ్లల్లో బాంబ్ పెట్టామని. అది ఎప్పుడైనా పేలవచ్చు అని ఇమెయిల్ వచ్చింది. అలర్ట్ అయిన విద్యాసంస్థలు స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. స్కూళ్లలో బాంబ్ ఉందనే వార్త తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్కూళ్లకు పరుగులు తీశారు. స్కూల్ యాజమాన్యాలు సెలవు ప్రకటించడంతో పిల్లలను తలిదండ్రులు తీసుకెళ్లారు.

ALSO READ: మనీష్ సిసోడియాకు షాక్.. మరోసారి కస్టడీ పొడింపు

స్కూల్లో బాంబ్ ఉందంటూ ఇమెయిల్ రావడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీస్ సిబ్బంది. బాంబ్ కోసం స్కూళ్లల్లో తనిఖీలు చెప్పట్టారు. అసలు ఈ ఇమెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై విచారణ చేయగా.. రష్యా సర్వర్ నుంచి ఇమెయిల్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఒకవేళ నిజంగానే బాంబ్ ఉందని హెచ్చరించారా? లేదా భయపెట్టేందుకు ఇలా ఎవరైనా ప్రాంక్ చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బెంగళూరులో కూడా ఈరోజు ఎనిమిది స్కూళ్లలో బాంబ్ పెట్టినట్లు తమకు మెయిల్ వచ్చిందని కర్ణాటక పోలీసులు తెలిపారు. దీంతో అక్కడ కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

100 స్కూళ్లకు బాంబ్ బెదిరింపు..

దేశరాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఈ నెల 8న ఉదయం ఢిల్లీ – ఎన్సీఆర్‌ ప్రాంతంలోని వందకు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన స్కూల్‌ యాజమాన్యాలు విద్యార్థులను బయటకు పంపించాయి. సమాచారం మేరకు వెంటనే ఆయా స్కూళ్లకు పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు చేరుకున్నాయి. పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు జరపగా.. ఎలాంటి బాంబులు ఉన్నట్లు గుర్తించలేదు. ఢిల్లీలోని దాదాపు 100 పాఠశాలలు, నోయిడాలో రెండు పాఠశాలలకు ఈ బాంబు మెయిల్స్ వచ్చాయి. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ బాంబు బెదిరింపు మెయిల్స్ బూటకమని తెలిపింది.

Advertisment
తాజా కథనాలు