తెలంగాణలో పోలింగ్ హడావుడి ఇవాళ మొదలైంది. కానీ కొన్ని ఓట్లు రెండు రోజుల క్రితమే నమోదయ్యాయి. రూల్ ప్రకారం ఎన్నికల్లో విధులు నిర్వహిస్తున్న వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఈ నెల 28నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సారి ప్రతీ ఒక్కరూ ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. మొత్తం 1.75 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపింది.
Also read:మొదలైన పోలింగ్.. తాజా అప్డెట్స్ !
అయితే ఈ విషయమై హైకోర్టులో నిన్న విచారణ జరిగింది. ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడంలో ఈసీ తగిన చర్యలు తీసుకోలేదంటూ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి ఎన్. సురేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద న్యాయస్థానం ధర్మాసనం లోక్ ఆరాధే, జె. అనిల్ కుమార్ లు విచారణ చేపట్టారు. అ విచారణలో ఈసీ తరుఫు న్యాయవాది పోసట్ల్ బ్యాలెట్ ద్వారా 1.75 లక్షల మంది ఉద్యోగులు ఓట్లు వేశారంటూ లెక్కలు చూపించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అందరికీ పోస్టల్ బ్యాలెట్లు అందించామని..వారు దాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్ మీద ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంటూ విచారణనను క్లోజ్ చేసింది. ఉపాధ్యాయ సంఘం అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది అంటూ విమర్శించింది.