Ganesh Laddu Auction: హైదరాబాద్ లో రికార్డ్ ధర పలికిన గణేష్ లడ్డూ.. రూ.1.20 కోట్లు.. ఎక్కడంటే?

హైదరాబాద్ లో గణేష్ లడ్డూ రికార్డ్ ధర పలికింది. సన్ సిటీలోని రిచ్ మండ్ విల్లాల్లో గణేష్ లడ్డూకు కోట్ల ధర పలికింది. ఒక్క లడ్డూను 1.20 కోట్లకు దక్కించుకున్నారు. గత ఏడాది ఇక్కడే వేలం పాటలో లడ్డూ 60.80 లక్షలు పలికింది.

Ganesh Laddu Auction: హైదరాబాద్ లో రికార్డ్ ధర పలికిన గణేష్ లడ్డూ.. రూ.1.20 కోట్లు.. ఎక్కడంటే?
New Update

హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాలో వినాయకుడి లడ్డూకు వేలంలో రికార్డ్ ధర పలికింది. గణేశుడి లడ్డూను ఏకంగా కోటి 26 లక్షలకు పాడుకున్నారు. వేలంలో వచ్చిన మొత్తాన్ని ఛారిటీకే ఉపయోగిస్తానని చెబుతున్నారు లడ్డూను దక్కించుకున్న ఆర్వీ దియా ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులు. గణపతి లడ్డూ ఇంత ధర పలకడం రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి. ఇక మాదాపూర్ మై హోమ్ భూజాలో కూడా గణపతి లడ్డూకు వేలంలో భారీ ధరనే సొంతం చేసుకుంది. ఇక్కడ లడ్డూ 25.50 లక్షలకు సొంతం చేసుకున్నారు అపార్ట్ మెంట్ వాసులు. చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి వినాయకుడి లడ్డూను సొంతం చేసుకున్నారు. మరోవైపు బాలాపూర్ లో గణేష్ లడ్డూ ఆక్షన్ ఇంకా నడుస్తోంది.

ganesh laddu

ఇక నవరాత్రుల్లో మండపాల్లో ఘనమైన పూజలందుకున్న గణనాథులు నేడు గంగమ్మ ఒడిలోకి చేరేందుకు బయలుదేరారు. ఖైరతాబాద్ వినియకుడి శోభాయత్ర ఉదయం 6గంటలకే ప్రారంభమైంది. చివరిసారిగా గురువారం రాత్రి కలశ పూజ నిర్వహించారు. శోభాయాత్రను వేగవంతం చేస్తున్నారు పోలీసులు. ఉదయం 8గంటల కల్లా టెలిఫోన్ భవన్ కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి 10 వరకు తెలుగుతల్లి ఫ్లై ఓవర్.. మధ్యాహ్ననం 12 కల్లా ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 వద్ద ఉండేలా ప్లాన్ చేశారు అధికారులు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ గణపతి బప్పా మోరియా అంటూ గణనాథునికి వీడ్కోలు పలికేందుకు ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నారు. బాలాపూర్‌ నుంచి చార్మినార్‌ మీదుగా.. హుస్సేన్‌సాగర్‌ వరకు గణేశుని శోభాయాత్ర జరగనుంది. భక్తుల కోసం 34 లక్షల వాటర్‌ ప్యాకెట్లు సిద్ధం చేశారు అధికారులు. వాటర్‌ ప్యాకెట్ల పంపిణీకి 122 స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. నిమజ్జనాల కోసం ప్రత్యేకంగా 3 వేల మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించారు.

గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 28న అంటే గురువారం రోజున హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ప్రభుత్వం సెలవు దినం ప్రకటించింది. జంట నగరాలతోపాటు మేడ్చల్, మాల్కాజిగిరి జిల్లాలకు కూడా సెలవు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారంనాడు పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.

ఇక గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్బంగా భక్తుల సౌకర్యార్థం 535 ప్రత్యేక బస్సులను టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం రెతిఫైల్‌ బస్‌ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్‌ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి:గణేశ్‌ నిమజ్జనం వేళ భక్తులకు గుడ్ న్యూస్.. రాత్రంతా మెట్రో.. టైమింగ్స్‌ ఇవే!

గంగమ్మ ఒడిలోకి ఖైరతాబాద్ గణనాయకుడు..ఉదయం 6గంటలకే శోభాయాత్ర ప్రారంభం..!!

#hyderabad #crores #festival #ganesh #laddu #sun-city #villa #highest-rates
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe