New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2-12-jpg.webp)
Telangana : తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన దివంగత ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఓ దుండగుడు రాళ్లతో ధ్వంసం చేసాడు. ఈ ఘటనను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.జయశంకర్ సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపిని డిమాండ్ చేశారు.
తెలంగాణ డిజిపిని డిమాండ్ చేసిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని గోవింద్ అనే వ్యక్తి ధ్వంసం చేశాడు. అత్యంత హీనమైన ఈ ఘటన శేర్లింగంపల్లి ఆల్విన్ కాలనీలో 124 డివిజన్‌లో చోటు చేసుకుంది.పోలీసుల ముందే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని రాళ్ళతో పగలకొట్టాడు సదరు వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధ్వంసం చేసిన దుండగుడిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజిపిని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజమంతా ఎంతగానో గౌరవించుకునే ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం చేయడం అత్యంత హీనమైన చర్య అంటూ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. అయితే.. విగ్రహాన్ని పగుల గొట్టిన ఆ వ్యక్తి.. తాగిన మైకంలో చేసి ఉంటాడని అక్కడ ఉన్న స్థానికులు అంటున్నారు. ఇంకా ఎన్ని దారుణాలు ఈ ప్రభుత్వ హయాంలో చూడాల్సివస్తుందో అంటూ కొంతంది తెలంగాణ వాదులు ఆందోళన చెందుతున్నారు .తెలంగాణ సాధనలో జయశంకర్ చేసిన అజరామరం కృషికి తెలంగాణా ప్రజలంతా ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణా ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.
Psycho Veeranga got inebriated in Elammabanda, Kukatpally, and smashed Professor Jayashankar's statue. pic.twitter.com/I0t1AigVQu
— Reporter shabaz baba (@ShabazBaba) January 16, 2024
అడ్డుకోకపోగా వీడియోలు తీసిన జనాలు
విచిత్రం ఏంటంటే .. ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు, అక్కడే ఉన్న స్థానికులు సైతం చూస్తూనే ఉన్నా ఎవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం చాలా బాధను కలిగించే విషయం.ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అడ్డుకోకపోగా కొంత మంది వీడియో తీసి.. సోషల్ మీడియాల్లో పోస్ట్ చేశారు. సమాచారం అందుకున్న పెట్రోలింగ్ పోలీసులు అక్కడకు చేరుకుని..తాగిన మైకంలో ఉన్న గోవింద్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తాజా కథనాలు