బౌలర్లు విసిరిన బంతులకి..బలైన వికెట్ కీపర్! జింబాబ్వే-ఐర్లాండ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో జింబాబ్వే వికెట్ కీపర్ చేసిన పని క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డును నెలకొల్పింది. వికెట్ కీపర్ వదిలిన బంతులకు ఏకంగా 42 బై రన్స్ సమర్పించుకోవాల్సి వచ్చింది. ఆరంగేట్ర మ్యాచ్ లోనే అతడు చేసిన పని పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. By Durga Rao 27 Jul 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి జింబాబ్వే-ఐర్లాండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లో జింబాబ్వే వికెట్ కీపర్ చెత్త ప్రదర్శన చేయడం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమవుతోంది. వికెట్ కీపర్ వదిలిన బంతులకు ఏకంగా 42 బై రన్స్ సమర్పించుకోవాల్సి వచ్చింది.దీంతో అతడు క్రికెట్ చరిత్రలో చెత్త రికార్డు మూటకట్టుకోవాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 210 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన ఐర్లాండ్ జింబాబ్వేపై 40 పరుగులు ఆధిక్యం సాధించింది.. అయితే, జింబాబ్వే జట్టులో అరంగేట్రం చేసిన వికెట్ కీపర్ క్లైవ్ మదంటే 42 పరుగులను బై రన్‌గా ఇచ్చాడు. ఆ బై పరుగులే ఐర్లాండ్ ఆధిక్యానికి దోహదపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో క్లైవ్ మదంటే చేసిన తప్పులు చాలా తక్కువ. ఇన్ని బై పరుగులకు ప్రధాన కారణం జింబాబ్వే బౌలర్ల పేలవమైన బౌలింగ్ చేయటమే. ఐర్లాండ్ జట్టు బ్యాటింగ్ చేసినప్పుడు జింబాబ్వే జట్టు బౌలర్లు బ్యాట్స్ మెన్ లెగ్ వికెట్ పై చాలా బంతులు విసిరారు. వికెట్ కీపర్ క్లైవ్ మదంటే-వాల్ చాలా బంతులను పట్టుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో అతడు క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. #irland #zimbabwe మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి