Heath Streak: జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు ఆయన భార్య నాడిన్ స్ట్రీక్ ధృవీకరించారు.

New Update
Heath Streak: జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూత

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్(49) మృతిచెందారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచినట్లు ఆయన భార్య నాడిన్ స్ట్రీక్ ధృవీకరించారు. స్ట్రీక్ మరణించారనే వార్త క్రికెట్ అభిమానులను ఆవేదనకు గురిచేసింది. స్ట్రీక్ ఆత్మకు శాంతి కలగాలని చెబుతూ తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ పోస్టులు కూడా చేస్తున్నారు. గత కొంతకాలంగా పేగు, కాలేయ సంబంధ క్యాన్సర్‌తో బాధపడుతూ దక్షిణాఫ్రికాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు స్ట్రీక్‌.

జింబాబ్వేలోని అత్యుత్తమ క్రికెటర్లలో హిత్ స్ట్రీక్ (Heath Streak)ఒకరు. 1993లో పాకిస్థాన్‌ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఆయన తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ సిరీస్‌లో రవల్పిండిలో జరిగిన రెండో మ్యాచ్‌లోనే ఎనిమిది వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. 2000 నుంచి 2004 మధ్య జింబాంబ్వే జట్టుకు (Zimbabwe) ఆయన కెప్టెన్‌గా వ్యవహరించారు. సుమారు 12 సంవత్సరాల పాటు ఆయన జింబాంబ్వే జట్టుకు సేవలందించారు.

publive-image

కెరీర్‌లో మొత్తం 65 టెస్టులు, 189 వన్డేలు ఆడారు. ఎన్నో మ్యాచుల్లో జింబాంబ్వేకు ఆయన ఒంటి చేత్తో విజయాలు సాధించి పెట్టారు. జింబాంబ్వే తరఫున టెస్టుల్లో 100 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా టెస్టుల్లో 1990 పరుగులు, వన్డేల్లో 2943 పరుగులు చేశారు. టెస్టుల్లో ఆయన అత్యధిక స్కోర్ 127 (నాటౌట్) విండీస్ జట్టుపై చేశారు. రిటైర్మెంట్ తర్వాత జింబాబ్వే, స్కాట్లాండ్, బంగ్లాదేశ్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టులకు కోచ్‌గా పనిచేశారు.

Advertisment
తాజా కథనాలు