ZIM vs IND: నాలుగో టీ20లో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం! జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్‌ను ఇండియా 3-1 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. ఆఖరి 5వ టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ జైస్వాల్ దక్కించుకున్నాడు. By srinivas 13 Jul 2024 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ New Update షేర్ చేయండి జింబాబ్వేతో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్‌ను ఇండియా 3-1 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే సొంతం చేసుకుంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ వికెట్ నష్టపోకుండా 15.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. India's young brigade take an unassailable 3-1 lead in the T20I series against Zimbabwe 👏 📝 #ZIMvIND: https://t.co/GTZwFl4KgJ pic.twitter.com/QTOcPzSCg7 — ICC (@ICC) July 13, 2024 భారత్ బ్యాటింగ్ యశస్వి జైస్వాల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (58 నాటౌట్; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు పరుగులు చేశారు. ఆఖరి 5వ టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు మధెవర్ (25), మరుమాని (32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ సికిందర్ రజా (46; 28 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 2, సుందర్, శివమ్ దూబె, అభిషేక్ శర్మ, తుషార్ దేశ్‌పాండే తలో వికెట్ తీశారు. #india-won-the-series #zim-vs-ind మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి