Zee News Matrize Survey: ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కొన్నిసార్లు బాంబులు కూడా పేలుతున్నాయి. జగన్ (YS Jagan), పవన్ (Pawan Kalyan) పర్శనల్‌గా ఒకరిపై ఒకరు మాటలతో విరుచుకుపడుతున్నారు. అటు చంద్రబాబు తన అనుభవనంతా రంగరించి పాచికలు వేస్తున్నారు. మరోవైపు పలు నేషనల్ మీడియా సంస్థలు సర్వేలతో బిజీగా ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన ఇండియా టూడే, టైమ్స్ నౌ సర్వేల లెక్కలు ఏపీలో (Andhra Pradesh) కాక రేపాయి. ఇక తాజాగా జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే సంచలనం సృష్టిస్తోంది.
గెలుపు వైసీపీదేనా?
ఏపీలో మొత్తం 25 లోక్‌సభ ఎంపీ స్థానాలున్నాయి. ఇందులో 19 స్థానాల్లో వైసీపీ (YCP) గెలుస్తుందని జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేస్తోంది. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమికి 6 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది. సంక్షేమం-అభివృద్ధి వైపు ప్రజలు మొగ్గు చూపారని సర్వే తేల్చింది. ఏపీలో ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని జీన్యూస్-మ్యాట్రిజ్ సర్వే అంటోంది. వైసీపీకి 48శాతం. టీడీపీ-జనసేనకు 44శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తోంది. ఇక తెలంగాణ విషయానికొస్తే కాంగ్రెస్‌కు 9.. బీజేపీకి 5.. బీఆర్‌ఎస్‌కు 2 ఎంపీ స్థానాలు వస్తాయని చెబుతోంది. ఎంఐఎం ఒక స్థానం గెలుచుకుంటుందని అంచనా వేసింది జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ ఎంపీ స్థానలున్న విషయం తెలిసిందే.
భిన్న సర్వేలు.. భిన్న ఫలితాలు:
ఇక ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ పనితీరు బాగుందని 38శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. 34శాతం మంది అసంతృప్తితో, 26శాతం మంది తటస్థంగా ఉన్నారని సర్వే చెబుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు సర్వే ఫలితాలను చూస్తే YSRCPకి 122 సీట్లు, టీడీపీ-జనసేన కూటమి 53 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే అంచనా వేస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క సీటు కూడా గెలవదని అంచనా వేసింది. గతంలో ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేకు భిన్నంగా జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే ఉండడం ఆసక్తిని రేపుతోంది. 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీకి (TDP) 17 స్థానాలు గెలుస్తుందని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. ప్రజలు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చెప్పగా.. జీ న్యూస్-మ్యాట్రిజ్ సర్వే మాత్రం ప్రజలు జగన్‌వైపే ఉన్నారంటోంది.
Also Read: గాయని చిన్మయి శ్రీపాద పై పోలీసు స్టేషన్ లో కేసు నమోదు!