OTT Release : రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ మూవీ!

విక్కి కౌశల్, సారా అలీఖాన్ జంటగా నటించిన 'జర హాట్కే జరా బచ్కే' మూవీ గత ఏడాది జూన్ నెలలో థియేటర్స్ లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని జియో సినిమా దక్కించుకోగా.. థియేటర్ లో రిలీజ్ అయిన ఏడాదికి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.

OTT Release : రిలీజైన ఏడాది తర్వాత ఓటీటీలోకి వస్తున్న రొమాంటిక్ మూవీ!
New Update

Zara Hatke Zara Bachke OTT Release : ఓటీటీ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక థియేటర్స్ లో రిలీజ్ అయిన కొత్త సినిమాల కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎంత స్టార్ హీరో సినిమా అయినా నెల లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్న రోజులివి.

publive-image

అలాంటిది ఓ రొమాంటిక్ మూవీ మాత్రం థియేటర్ లో రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఇప్పడు ఓటీటీ స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. ఇంతకీ ఆ రొమాంటిక్ సినిమా ఏది? ఏ ఓటీటీలో రాబోతుంది? అనే వివరాల్లోకి వెళ్తే..

publive-image

Also Read : ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ పై పోలీస్ కేసు!

రిలీజైన ఏడాదికి ఓటీటీలో

బాలీవుడ్ హీరో విక్కి కౌశల్, సారా అలీఖాన్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ 'జర హాట్కే జరా బచ్కే' గత ఏడాది జూన్ నెలలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో విక్కీ, సారా తమ కెమిస్ట్రీ తో అదరగొట్టేసారు.

publive-image xr:d:DAFTUXuatDs:2147,j:7071062239285677712,t:23113012

ఈ సినిమాలోని 'తేరే వాస్తే' అనే సాంగ్ అప్పట్లో తెగ పాపులర్ అయింది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో ఈ పాట మారుమోగిపోయింది. సినిమాలోని మిగతా పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయకపోవడంతో ఆడియన్స్ కి ఎక్కువగా రీచ్ కాలేదు.

కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని జియో సినిమా దక్కించుకోగా.. థియేటర్ లో రిలీజ్ అయిన ఏడాదికి ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. అయితే ఇంత ఆలస్యంగా ఎందుకు రిలీజ్ చేస్తున్నారనేది తెలియక పోయినా ఫైనల్ గా మే 17 నుంచి ఈ సినిమాని స్ట్రీమింగ్ కి అందుబాటులోకి తెస్తున్నారు

#vikki-kaushal #zara-hatke-zara-bachke
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe