వాళ్లిద్దరి టెస్ట్ రికార్డులూ సేమ్ టు సేమ్.. వండర్ !! జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ఇద్దరూ తమ కెరీర్లలో ఒకేలా 311 టెస్ట్ వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ తన కెరీర్లో 105 టెస్ట్ మ్యాచ్ లు ఆడగా, జహీర్ ఇండియాలో రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్ లలో 92 మ్యాచ్ లు ఆడాడు. ఈ కాకతాళీయ 'ఘటన' ఇక్కడితో ఆగలేదు. ఇద్దరూ ఒకేసారి 11 సార్లు 5 వికెట్లు, ఓసారి 10 వికెట్లు తీశారు. భారతీయ గడ్డపై ..స్వదేశంలో 104 వికెట్లు, ఇతర దేశాల్లో 207 వికెట్లు తీశారు. లెక్కల్లో తాను, జహీర్ ఇద్దరూ వీక్ అని, కానీ తమ కెరీర్లలో ఇలా పోలికలు ఉండడం చూసి తాము షాక్ తిన్నామని ఇషాంత్ చెప్పాడు. By M. Umakanth Rao 25 Jul 2023 in ఇంటర్నేషనల్ నేషనల్ New Update షేర్ చేయండి భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ అయిదోది, తుది మ్యాచ్ కి వరుణుడు మాటిమాటికీ అడ్డుపడినప్పటికీ ఇక్కడో విచిత్రం జరిగింది. ఈ టెస్ట్ కి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన మాజీ ఇండియన్ పేసర్లు ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్.. ఇద్దరూ తమతమ కెరీర్లలో దిగ్భ్రాంతికరమైన రికార్డులు ఉండడం చూసి షాక్ తిన్నారు. అదే సమయంలో వారి సంతోషానికి అంతు లేకుండా పోయింది కూడా.. ఇది కాకతాళీయమో ఏమో గానీ.. అచ్చు గుద్దినట్టున్న వీరి రికార్డులు చూసి.. నెటిజనులు సైతం .. ఇదేందయ్యా ఇట్లా ఉంది అంటూ తమాషాగా సెటైర్లు వేస్తూ తాము కూడా ఆశ్చర్యపోతున్నారు. జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ ఇద్దరూ తమ కెరీర్లలో ఒకేలా 311 టెస్ట్ వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ తన కెరీర్లో 105 టెస్ట్ మ్యాచ్ లు ఆడగా, జహీర్ ఇండియాలో రెడ్ బాల్ క్రికెట్ మ్యాచ్ లలో 92 మ్యాచ్ లు ఆడాడు. ఈ కాకతాళీయ 'ఘటన' ఇక్కడితో ఆగలేదు. ఇద్దరూ ఒకేసారి 11 సార్లు 5 వికెట్లు, ఓసారి 10 వికెట్లు తీశారు. భారతీయ గడ్డపై ..స్వదేశంలో 104 వికెట్లు, ఇతర దేశాల్లో 207 వికెట్లు తీశారు. లెక్కల్లో తాను, జహీర్ ఇద్దరూ వీక్ అని, కానీ తమ కెరీర్లలో ఇలా పోలికలు ఉండడం చూసి తాము షాక్ తిన్నామని ఇషాంత్ చెప్పాడు. విండీస్ తో టెస్ట్ సమయంలో జహీర్, ఇషాంత్ హిందీ కామెంటరీ బాక్స్ లో ఉండగా బ్రాడ్ కాస్టర్లు విచిత్రమైన ఈ 'గణాంకాలను' వెలుగులోకి తెచ్చారు. తమకే తెలియని ఈ విషయాలను క్రికెట్ ప్రపంచానికి తెలియజేసినందుకు వీరిద్దరూ బ్రాడ్ కాస్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. భారత్- విండీస్ సిరీస్ కు జియో సినిమా కామెంటేర్లుగా ఉన్న వీరి పర్సనల్ విషయాలకు వస్తే.. 2011 లో సౌరవ్ గంగూలీతో బాటు ధోనీ సారథ్యంలో ప్రధాన పేసర్ గా కొనసాగిన జహీర్.. టీమిండియా వాల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ రోజున ముంబై-వాంఖడే స్టేడియం మొత్తం ఇతని దూకుడుతో హోరెత్తింది. ఆ ఏడాది ఏప్రిల్ 2 ఇండియా విన్నింగ్ 12 వ యానివర్సరీ.. 23 మ్యాచుల్లో 44 వికెట్లు తీసిన ఘనత అతనిది. ఇక ఆ టోర్నీ తరువాత జట్టుకు దూరమైన జహీర్.. ఇంటర్నేషనల్ క్రికెట్ కు దూరమై ముంబై ఇండియన్స్ డైరెక్టర్ గా, వ్యాఖ్యాతగా, ఎనలిస్టుగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇషాంత్ అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్నా కామెంటేటర్ అయ్యాడు. జియో సినిమా హిందీ వ్యాఖ్యాతగా మారాడు. ఇండో-వెస్టిండీస్ మ్యాచ్ కి వర్షం అడ్డురావడంతో మొత్తానికి ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇండియా 1-0 సిరీస్ ని గెలుచుకుంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి