CM Jagan: విశాఖ నుంచే సీఎం జగన్‌ పాలన.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు!

త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన సాగిస్తారని స్పష్టం చేశారు వైవీ సుబ్బారెడ్డి. ఎమ్మెల్సీ వంశీ యాదవ్ వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో ఎందుకు చేరారో ఆయనే సమాధానం చెప్పాలని అన్నారు. పార్టీకి ఎవరు రాజీనామా చేసిన తమకు నష్టం లేదని అన్నారు.

CM Jagan: విశాఖ నుంచే సీఎం జగన్‌ పాలన.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు!
New Update

Y. V. Subba Reddy : వైసీపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్న విషయం తెలిసిందే. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్(Vamshi Krishna Yadav) జనసేనలో చేరడంపై వైవీ సుబ్బారెడ్డి(Y. V. Subba Reddy) ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్సీ(MLC) పదవి ఇచ్చిన రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలని పరోక్షంగా విమర్శించారు. ఎంతమంది నాయకులు ఉన్నా బీసీలకు న్యాయం చేయాలని వంశీకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చామని పేర్కొన్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లిన తమకు ఇబ్బంది లేదు అని స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో(AP Assembly Elections) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan) మళ్ళీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపుపై విచారణ వాయిదా

పవన్(Pawan Kalyan), చంద్రబాబు(Chandrababu) ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన తమ నాయకుడికి తిరుగులేదని అన్నారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి చూసి మళ్లీ ప్రజలు వైసీపీ పార్టీ ఆశీర్వదిస్తారని తెలిపారు. ఎక్కడైతే పార్టీ పరిస్థితి బాగోలేదు అక్కడే ఇన్‌చార్జీలను మార్చినట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 టార్గెట్ పెట్టుకున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. ఎక్కడ అయితే అభ్యర్థులను మారుస్తున్నామో అక్కడ ముందు పనిచేసిన నాయకులు సహకరించాలని సీఎం జగన్ చెప్పినట్లు తెలిపారు. కోర్ట్ పరిధిలో ఇబ్బందులు వల్ల రాజధాని మార్చడం ఆలస్యం అయిందని అన్నారు. తప్పకుండా సీఎం జగన్‌ విశాఖ నుంచి పాలన సాగిస్తారని తేల్చి చెప్పారు.

ALSO READ: సీఎం గుడ్ న్యూస్.. రేపు అకౌంట్‌లోకి డబ్బు జమ

#cm-jagan #ap-latest-news #ap-capital-vishaka #y-v-subba-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe