డిసెంబర్‌లో ఐపీఎల్ మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ఈసారి ఏ జట్టు ఎంత మంది ఆటగాళ్లను రిటైన్ చేయాలనేది ఇంకా
నిర్ణయించలేదు.ఈ అంశంపై చర్చించేందుకు ఐపీఎల్ యాజమాన్యంతో ఈ నెల 31న బీసీసీఐ సమావేశం కానుంది. అంతే కాకుండా ఈసారి అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు వేతనాలు పెంచేందుకు ఒక్కో జట్టుకు అదనపు నగదు ఇవ్వాలని బీసీసీఐ పరిశీలిస్తోంది.
అలాగే ఐపీఎల్ మెగా వేలం ఎక్కడ, ఎలా నిర్వహించాలనే దానిపై కూడా చర్చలు జరగనున్నాయి. దీంతో కోచింగ్ సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని ఐపీఎల్ జట్లు ఆలోచిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ జట్టు కోచ్‌గా రికీ పాంటింగ్‌ను ఇప్పటికే తొలగించారు. అంతే కాకుండా రాజస్థాన్ జట్టు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గుజరాత్ జట్టు కోచ్‌ల నుంచి ఆశిష్ నెహ్రా, విక్రమ్ సోలంకీ తప్పుకున్నారు. దీంతో ఆ స్థానంలో భారత దిగ్గజం యువరాజ్ సింగ్ ను తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయనే వార్త ట్రెండింగవుతుంది.
గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ యువరాజ్ సింగ్ అకాడమీలో శిక్షణ పొందాడు. అదేవిధంగా హైదరాబాద్ తరఫున ఆడుతున్న అభిషేక్ శర్మ కూడా యువరాజ్ సింగ్ శిష్యుడుగా ఉన్నాడు. యువ ఆటగాళ్లను బాగా ముందుండి నడిపిస్తున్న యువరాజ్ సింగ్ కోచ్‌గానూ రాణిస్తాడని గుజరాత్ టీమ్ మేనేజ్‌మెంట్ విశ్వసిస్తున్నట్లు కనిపిస్తోంది. భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఇప్పటికే కన్సల్టెంట్‌గా వ్యవహరించి కేకేఆర్‌కు ట్రోఫీని అందించడంతో గుజరాత్ చూపు యువరాజ్ సింగ్ వైపు మళ్లింది.
శుభ మన్ గిల్ కెప్టెన్‌గా ఉండటంతో యువరాజ్ సింగ్ సొంతంగా అన్ని నిర్ణయాలు తీసుకోగలడు. అలాగే మెగా వేలానికి ముందే గుజరాత్ టీమ్ మేనేజ్‌మెంట్ ప్రధాన కోచ్‌తో సంతకం చేసి తదుపరి చర్యలు చేపట్టాలి. అలా చేస్తేనే మెగా వేలంలో మళ్లీ బెస్ట్ టీమ్‌ను ఏర్పరుచుకోవచ్చని మేనేజ్ మెంట్ భావిస్తుంది.