పొంగులేటి ఉక్కిరిబిక్కిరి.. షర్మిలతో పాటు వీరందరికీ ఆయనే టార్గెట్!

ఖమ్మం జిల్లాలో బీఎస్ఎస్ ను సున్నా సీట్లకు పరిమితం చేయాలన్న టార్గెట్ తో ఉన్న పొంగులేటి ఈ క్రమంలో జిల్లా అంతా శత్రువులను తయారు చేసుకున్నాడన్న చర్చ సాగుతోంది. షర్మిలతో పాటు సీపీఎం, సీపీఐ, రాంరెడ్డి ఫ్యామిలీకి ఆయన టార్గెట్ గా మారారని తెలుస్తోంది.

New Update
పొంగులేటి ఉక్కిరిబిక్కిరి.. షర్మిలతో పాటు వీరందరికీ ఆయనే టార్గెట్!

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ (BRS Pary) నుంచి ఒక్క అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) గతంలో చేసిన శపథం. తాను చేసిన ఈ శపథాన్ని నెరవేర్చుకోవడమే లక్ష్యంగా శ్రీనివాసరెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వివిధ పార్టీలతో, నాయకులతో ఆయన అనవసన వివాదాలు తెచ్చకుని వారికి టార్గెట్ గా మారరన్న ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితులు ఆయన సొంత సీటుకు ఎసరు తెచ్చే ప్రమాదాన్ని కల్పించాయన్న చర్చ ఉమ్మడి జిల్లాలో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ (YSRTP) విలీనాన్ని రేవంత్ తో కలిసి పొంగులేటి అడ్డుకున్నారని షర్మిల భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: కేసీఆర్ అంటే కాళేశ్వరం కరెప్షన్ రావు.. కేంద్ర సహకారంతోనే ఐటీ దాడులు: రేవంత్ రెడ్డి సంచలన వాఖ్యలు

దీంతో ఆమె పొంగులేటిని టార్గెట్ చేశారు. దీంతో పాలేరులో పొంగులేటికి పోటీగా నిలబడాలని ఫిక్స్ అయ్యారు. మరో ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్యంగా పాలేరులో బలంగా ఉన్న సీపీఎం సైతం పొంగులేటిపై గుర్రుగా ఉంది. పొత్తుల్లో భాగంగా వైరా సీటును తమకు రాకుండా పొంగులేటి అడ్డుగా మారరని సీపీఎం నేతలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పాలేరులో అభ్యర్థిని నిలుపుతామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. సీపీఐ కూడా కొత్తగూడెం టికెట్ తమకు రాకుండా పొంగులేటి వేలు పెట్టాడని కోపంతో ఉంది.

దీంతో ఆ పార్టీకి కూడా శత్రువుగా మారారు శ్రీనివాసరెడ్డి. సూర్యాపేట టికెట్ ను పటేల్ రమేశ్ రెడ్డికి ఇవ్వాలంటూ పైరవీ చేసి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కూడా శత్రువుగా మారారు పొంగులేటి. పాలేరు నుంచి దామోదర్ రెడ్డి సోదరుడు దివంగత మాజీ మంత్రి వెంకట్ రెడ్డి రెండు సార్లు గెలుపొందారు. దీంతో ఆ నియోజకవర్గంలో రాంరెడ్డి కుటుంబానికి పట్టు ఉంది. దీంతో వారంతా పొంగులేటికి సపోర్ట్ చేస్తారా? లేదా? అన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారింది.

Advertisment
తాజా కథనాలు