Apoori Somanna: వైఎస్ షర్మిలకు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి ఏపూరి సోమన్న..

ప్రముఖ తెలంగాణ గాయకుడు, వైఎస్సార్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఈ రోజు ఆయన మంత్రి కేటీఆర్ ను బీఆర్ఎస్ నేతలు బల్కా సుమన్, దేశపతి శ్రీనివాస్ తో కలిసి చర్చలు జరిపారు.

New Update
Apoori Somanna: వైఎస్ షర్మిలకు బిగ్ షాక్.. బీఆర్ఎస్ లోకి ఏపూరి సోమన్న..

ప్రముఖ గాయకుడు, వైఎస్సాఆర్టీపీ నాయకుడు ఏపూరి సోమన్న (Apoori Somanna) బీఆర్ఎస్ లో (BRS Party) చేరనున్నారు. ఈరోజు మంత్రి కేటీఆర్ తో సోమన్న సమావేశమయ్యారు. బీఆర్ఎస్ లో చేరాలన్న నిర్ణయాన్ని కేటీఆర్ కు సోమన్న స్వయంగా తెలిపినట్లు సమాచారం. సోమన్న నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కవి, గాయకుడు అయిన ఏపూరి సోమన్న తొలుత అరుణోదయ సంస్థలో పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సోమన్న.. తన ఆటాపాటలతో ప్రజలను ఉర్రూతలూగించారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ సర్కార్ సోమన్నకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగం కల్పించింది. అయితే.. కొన్నాళ్లకే సోమన్న ఆ ఉద్యోగాన్ని వదిలి కేసీఆర్ సర్కార్ విధానాలపై తన పాటల ద్వారా పోరాటం చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన సోమన్న మూడేళ్ల క్రితం షర్మిల సారథ్యంలోని వైఎస్సాఆర్టీపీలో చేరారు.

సోమన్న తమ పార్టీ నుంచి తుంగతుర్తి అభ్యర్థిగా పోటీ చేస్తారని సైతం షర్మిల ప్రకటించింది. అయితే.. ఇటీవల కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడానికి షర్మిల సిద్ధం అయిన నాటి నుంచి సోమన్న అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధమై కేటీఆర్ ను కలిశారు. సోమన్న వెంట బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, దేశపతి శ్రీనివాస్, దాసోజ్ శ్రవణ్ తదితరులు ఉన్నారు.

ప్రముఖ గాయకుడు సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సాయిచంద్ బీఆర్ఎస్ సభలలో తన పాటలతో ప్రజలను, కార్యకర్తలతో జోష్ నింపేవారు. ఆయన మృతి చెందిన నాటి నుంచి ఆ లోటు బీఆర్ఎస్ మీటింగ్ లలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ లోటును సోమన్నతో భర్తీ చేయాలన్నది బీఆర్ఎస్ హైకమాండ్ ఆలోచనగా తెలుస్తోంది.
Also Read:
Telangana BJP: కిషన్ రెడ్డికి బిగ్ ఝలక్ ఇచ్చిన ప్రధాన అనుచరుడు.. ఆ వెంటనే..

Advertisment
తాజా కథనాలు